హిందూపురం ఎంపీ సీటును గాలి జనార్ధన్ రెడ్డి కోటాకు వైసీపీ అధినేత జగన్ రెడ్డి కేటాయిచినట్లుగా తెలుస్తోంది. గోరంట్ల మాధవ్ కు ఎక్కడా అసెంబ్లీ సీటు కూడా కేటాయించడం లేదు. హిందూపురం ఎంపీ సీటును మాత్రం .. శ్రీరాములు సోదరి శాంతకు కేటాయించినట్లుగా తెలుస్తోంది. శ్రీరాములుకు ఏపీతో సంబంధం లేదు. ఆయన కర్ణాటక వ్యక్తి . బీజేపీ తరపున బ ళ్లారి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గతంలో ఉపముఖ్యమంత్రిగా పని చేశారు. గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ సామ్రాజ్యంలో ఆయనది కీలక పాత్ర. అంతా బాగున్నప్పుడు బళ్లారిలో చక్రం తిప్పుతున్నప్పుడు 2009లో శ్రీరాములు తన సోదరి జె.శాంతను లోక్ సభ సభ్యురాలిగా టిక్కెట్ ఇచ్చి గెలిపించుకున్నారు.
ఆ తర్వాత ఎన్నికల్లో శ్రీరాములే పోటీ చేశారు. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే బళ్లారిలో గెలిచారు. ఇటీవలి ఎన్నికల్లో గాలి , శ్రీరాముల సామ్రాజ్యం కుప్పకూలింది. బీజేపీలో టిక్కెట్ రాదని తేలడంతో సొంత పార్టీ పెట్టుకుని ఒక్కరే గెలిచారు. బళ్లారిలో బీజేపీ నుంచి శ్రీరాములు పోటీ చేయాలనుకుంటున్నారేమో కానీ.. ఏపీ నుంచి ఆయన సోదరి శాంతను దింపుతున్నారు.
వైసీపీ అధినేత జగన్ తన వ్యాపార భాగస్వాములు, ఇతర అవసరాల కోసం రాజ్యసభ సీట్లను బయట రాష్ట్రాల వారికి కేటాయించేవారు ఆర్. కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి, పరిమళ్ నత్వానీ ఇలా పలువురికి చాన్సిచ్చారు. ఇప్పుడు నేరుగా లోక్ సభకు కూడా పక్క రాష్ట్రాల నుంచి నేతల్ని దిగుమతి చేస్తున్నారు. ఇది ఆ పార్టీ నేతల్నే కాదు.. రాష్ట్ర ప్రజల్నికూడా అవమానించడమేనన్న వాదన వినిపిస్తోంది.