పాము తన పిల్లల్ని తానే చంపుకు తింటుందట… ఇది వైసీపీ పార్టీకి వంద శాతం సరిపోతుంది. ఆ పార్టీకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని వందల మంది ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సోషల్ మీడియా కోసం పని చేశారు. అలాంటి వారిని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి.. కుల విద్వేషాలు పెంచడానికి… విస్తృతంగా వాడుకుంది వైసీపీ హైకమాండ్. అలాంటి పేజీలను శ్యామ్ కలకడ, గౌతమి.కె వంటి వారు నడిపారు. అధికారపక్షంలో ఉండి ఇలాంటి వారి దూకుడును కూడా అప్పట్లో టీడీపీ సోషల్ మీడియా అడ్డుకోలేకపోయారు.
వైసీపీ విజయంలో ఈ ఫేక్ న్యూస్ ఎంత పకడ్బందీగా పని చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఆ సోషల్ మీడియా వైరల్ పేజీలు నడిపిన వాళ్లంతా ఏమయ్యారో ఎవరికీ తెలియదు. కొంతమంది కనిపించకుండా పోయారు. ఈ పని తప్ప మరేమీ రాని వాళ్లు….తాము మోసపోయామని గుర్తించి ఇతర పార్టీల్లో చేరిపోయారు. చచ్చిపోయినవాళ్లు బతికిపోయారన్నట్లుగా.. ఇతర పార్టీల్లో చేరిన వారిని మాత్రం వైసీపీ వెంట పడి వేధిస్తోంది.
శ్యామ్ కలకడ అనే వైసీపీ సోషల్ మీడియా సైనికుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సొంత డబ్బుతో ఆయన వైసీపీ కోసం సోషల్ మీడియా సైన్యాలను నడిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన అడ్రస్ లేకుండా పోయారు. అనారోగ్యంతో బెంగళూరులో ఆస్పత్రి పాలైతే… పైసా సాయం చేయలేదు. ఆర్థిక సమస్యలతో సరైన వైద్యచేయించుకోలేక చనిపోతే… కనీసం సానుభూతి చూపిన వారు కూడా లేరు. ఒక వేళ ఆయన ఉన్నట్లయితే.. గౌతమి.కే అనే పేజీ నడిపిన సోషల్ మీడియా కార్యకర్తలాగా గంజాయి కేసుల్లో ఇరుక్కుని పోలీసుల దగ్గర కోటింగ్ తీసుకుంటూ ఉండేవారేమో.
ఈ గౌతమి.కే అనే పేజీ నడిపిన వ్యక్తి పేరు అజయ్ అమృత్. ఆయన జడ్దిల కేసు వచ్చే వరకూ వైసీపీ కాంపౌండ్ లోనే ఉన్నారు. జైలుకు కూడా వెళ్లారు. కానీ బెయిల్ ఇప్పించేందుకు కూడా ఎవరూ రాలేదు. దీంతో ఎలాగోలా బయటకు వచ్చారు. తర్వాత కూడా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయన టీడీపీ పంచన చేరి… తనకు తెలిసిన విద్యను ప్రదర్శిస్తున్నారు అయితే ఆయన ఇలా చేస్తారా అంటూ.. పోలీసులు గంజాయి కేసు పేరుతో హైదరాబాద్ నుంచి నరసరావుపేట తీసుకెళ్లి ధర్డ్ డిగ్రీ ఇచ్చేశారు.
అటు శ్యామ్ కలకడ చనిపోయినా.. అటు అజయ్ అమృత్ అనే వ్యక్తికి ధర్డ్ డిగ్రీ ఇచ్చినా.. గుర్తించాల్సింది ఏమింటంటే.. వీరు హార్డ్ కోర్ జగన్ భక్తులు. కానీ వారినే చంపుకుతినేస్తున్నారు.. వైసీపీ పెద్దలు. ఈ విషయాన్ని మిగిలిన ఉన్న వారైనా అర్థం చేసుకుంటే సేఫ్ అవుతారు… లేదంటే… టీడీపీ కాదు.. వైసీపీ చేతుల్లోనే వారికీ ఇలాంటి ట్రీట్ మెంట్ తప్పదు మరి !