నెల్లూరు, పల్నాడు జిల్లాల్లో వైసీపీ ఖాళీ అవుతోంది. టీడీపీ గత ఎన్నికల్లో వైట్ వాష్‌కి గురైన నెల్లూరు జిల్లాలో వైసీపీ లీడర్, క్యాడర్ అంతా టీడీపీ గూటికి చేరుతున్నారు. కీలకమైన నేత…బడా పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు జిల్లా వ్యాప్తంగా ఆయన అనుచరగణం.. ద్వితీయ శ్రేణి క్యాడర్ టీడీపీలో చేరుతున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరులో సగం సీట్లు గెలిచిన దాఖలు లేవు. గతంలో ఇదే జిల్లా నుండి టీడీపీ లో కిముగ్గురు వైసీపీ ఎమ్మెల్యే లు చేశారు. వీరి రాకతో నెల్లూరు జిల్లాలో టీడీపీ కంచుకోట గా మరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఈ జిల్లా నుంచి రెండు దక్కినా గొప్పేనన్న వాదన అప్పుడే వినిపిస్తోంది.
మరో వైపు పల్నాడు నుండి కీలక నేతలు టీడీపీలో చేరబోతున్నారు. సాయంత్రం జరగబోయే సభలో పల్నాడు జిల్లా నుండి ఎంపీ కృష్ణ దేవరాయలు.. ఎమ్మెల్సీ జంగా కృషమూర్తి… మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు సహా కొన్ని వందల మంది స్థానిక సంస్థల ప్రతినిధులు…వైసీపీ క్యాడర్ టీడీపీలో చేరనున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ 7 అసెంబ్లీ తో పాటుగా పార్లమెంట్ ని కైవసం చేసుకుంది.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు..నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ప్రజల్లో బలం ఉన్న నేత కృష్ణ దేవరాయలు… వైసీపీ క్యాడర్ ను తీసుకుని టీడీపీలో చేరుతున్నారు.
ఇక ఉదయమే చంద్రబాబు నివాసంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరనున్నారు. ఆయన కూడా వైసీపీ తీరును తప్పు బట్టి బయటకు వచ్చారు. మైలవరం వైసీపీ క్యాడర్ లో సగంపైనే ఆయన వెంట వస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత చేరికల జోరు మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.