అధికారంలోకి వచ్చి నాలుగున్నరేల్లు అయింది. ఆరు లక్షల కోట్ల అవినీతి అని పుస్తకాలు వేశారు. ఇప్పటికీ నయాపైసా అవినీతి చూపించలేకపోయారు. పైగా పోలవరంలో అవినీతి లేదని స్వయంగా క్లీన్ చిట్ ఇచ్చారు. అమరావతిలో ఆళ్ల పేరుతో ఫిర్యాదులు చేయించడం తప్ప.. స్కాం జరిగిందని ఒక్క ఆధారం బయట పెట్టలేకపోయారు. హెరిటేజ్ మజ్జిగను వేలు పెట్టి కొన్నారని ఆరోపించారు. ఇలా చిన్నా చితకా ఆరోపణల దగ్గరనుంచి భారీ స్కాంల వరకూ చాలా ఆరోపణలు చేశారు. లెక్కలేనన్ని ఎంక్వయిరీలు వేశారు. ఒక్క రూపాయి కూడా బయట పెట్టలేకపోయారు.
అయితే ఇప్పుటు ఐటీ నోటీసులు చంద్రబాబుకు వచ్చాయంటూ హడావుడి ప్రారంభించారు. ఆ నోటీసులు వచ్చాయి. చంద్రబాబు సమాధానం ఇచ్చారు. అందులో డబ్బులు తీసుకున్నట్లుగా ఎక్కడా లేదు. సీబీఎన్ స్టీల్ అనే కోడ్ వాడారాని అవి టన్నుల లెక్కలో ఉన్నాయని.. అవి డబ్బులేనని ఐటీ నోటీసుల్లో ఉంది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేయడం కోసమే .. ఇలాంటి నోటీసులు ఇచ్చారేమో అన్నట్లుగా ఉన్న వ్యవహారాన్ని ప్రణాళికాబద్దంగా ప్రచారం చేయడానిక వైసీపీ వాడుకుంటోంది.
ఓ సారి హిందూస్తాన్ టైమ్స్ లో మరోసారి డెక్కన్ క్రానికల్ లో ఇంకోసారి పయనీర్ లో ఇలా నోటీసుల్ని రాయించుకుని.. వాటిపై తమ నేతల్ని ప్రెస్మీట్లు పెట్టిస్తోంది. అదే పనిగా ఆరోపణలు చేస్తోంది. నిజంగా ఏదైనా ఉంటే.. ఐటీ వాళ్లు కదా అడగాల్సింది..కానీ వైసీపీ నేతలు మాత్రం ఈ నోటీసులతో ఈదేయాలనుకుంటున్నారు. ఈ నోటీసుల్లో పస లేదని స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి తన ప్రెస్ మీట్ లోనే అంగీకరించారు. సాంకేతిక అంశాలతో చంద్రబాబు తప్పించుకున్నారని అన్నారు. అంటే అందులో విషయం లేదని ఆయనకూ అర్థమైంది. నిజంగా డబ్బులు అవినీతి జరిగితే ఏ సాంకేతిక అంశమూ అడ్డు రాదు. ఆ విషయం సజ్జలకు బాగా తెలుసు.
అడ్డగోలు సంపాదనలో రాటుదేలిపోయి.. ప్రజల ఆస్తుల్ని రక్తాల్ని కూడా పిలుస్తున్న వైసీపీ నేతలు.. చంద్రబాబుపై ఎక్కడో మేనేజ్ చేసి ఇప్పించిన ఓ నోటీసును పట్టుకుని వచ్చి.ి. ఆ బురదంతా తమకు పూయాలని అనుకోవడం అమాయకత్వం అని..టీడీపీ నేతలు నవ్వుకుంటున్నారు.