సొంత పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ప్రభుత్వాన్ని చుట్టుముడితే అది టీడీపీ సమస్య అన్నట్లుగా తప్పించుకోవాలని చూస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ ట్యాపింగ్ సమస్య విపక్ష నేతలు చేస్తే… అది రాజకీయం అని తప్పించుకోవచ్చు కానీ సొంత పార్టీ నేతలు చేస్తున్నారు. ట్యాపింగ్ ఫ్రూఫ్ కూడా రిలీజ్ చేశారు. అది ట్యాపింగ్ కాదని నిరూపించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై పడింది. కానీ ప్రభుత్వం మాత్రం అది ట్యాపింగ్ కాదు..,రికార్డంగ్ అని ప్రత్యారోపణులు చేయిస్తోంది. కానీ నిజంగా ఏం జరిగిందో … ప్రభుత్వంలో చాలా మందికి స్పష్టంగా తెలుసు.
ప్రస్తుతం ఈ అంశం కేంద్ర హోంశాఖ దగ్గరకు వెళ్లే సూచనలు కనిపిస్తూండటతో కోటంరెడ్డిపై వైసీపీ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. ఆయన టీడీపీతో చంద్రబాబుతో లోకేష్‌తో టచ్‌లో ఉన్నారని చెప్పేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఈ విషయంలో కోటంరెడ్డి తర్వాత అడుగు ఏం వేస్తారో కానీ ఆయనకు మరికొంత మందిజత కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ సజ్జల మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశం చంద్రబాబు స్కీం అని.. దీనిలో కోటంరెడ్డి లాంటి వాళ్ళు పాత్రధారులని ఆరోపిస్తున్నారు.
రాజకీయంగా టీడీపీ దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో ఉందని.. అందుకే లేని విషయాలను ఉన్నట్లు సృష్టించే ప్రయత్నం చేస్తోందని చెప్పుకొస్తన్నారు. ప్రజలకు సంబంధించి మాట్లాడే అంశాలు లేకపోవడంతోనే టీడీపీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారంటున్నారు. నిజానికి ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్న వారంతా వైసీపీ నేతలే. ఈ విషయాన్ని కప్పి పుచ్చి సజ్జల రాజకీయం చేసేద్దామనుకుంటున్నారు. కానీ సకల శాఖ మంత్రిగానే కాకండా.. ఇంటలిజెన్స్ ను నియంత్రించిన రాజ్యాంగేతర శక్తిగా కూడా ఆయనదే కీలక పాత్ర అనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మీద పడుతూండేసరికి.. అది టీడీపీ ప్రాబ్లం అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.