జగన్ సర్కార్ నవరత్నాల శిలాఫలకాలను ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందు కోసం రూ. వంద కోట్లపైనే ఖర్చు చేయనుంది. ఈ శిలాఫలకంపై ఏముంటుందంటే… ఓ సర్కిల్ మధ్యలో జగన్ బొమ్మ… దాని చుట్టూ నవరత్నాల పేరతో పథకాల బొమ్మలు. ఎవరూ తీసేయకూడదని .. స్ట్రాంగ్‌గా ఉండాలనో లేకపోతే గ్రానైట్ వ్యాపారులకు అవసరం అనో కానీ శిలాఫలకాల మీద వేయించాలని నిర్ణయించారు. ప్రభుత్వం అధికారంలో ఉంది.. ప్రజాధనాన్ని ఇష్టారీతిన ఖర్చు పెట్టుకోవచ్చు. వారికి అడ్డం లేదు. కానీ అసలు ఆ నవరత్నాల శిలాఫలకాల మీద వైఎస్ బొమ్మే ఉండటం లేదు. అదే ఇప్పుడు అసలు టాపిక్.
జగన్ పార్టీ ప్రారభించిన మొదట్లో.. సర్కిల్లో వైఎస్ బొమ్మ ఉండేది. ఆ తర్వాత చుట్టూ వివిధ పథకాల గుర్తులు ఉండేవి. తర్వాత కొన్నాళ్లకు వైఎస్ పైన.. జగన్ బొమ్మ వచ్చింది. ఇప్పుడు వైఎస్ బొమ్మను పూర్తిగా తొలగించారు. ఇటీవల అసెంబ్లీలో జగన్ చెప్పిన లాజిక్ ప్రకారం.. నవరత్నాలపై బొమ్మ ఉండేందుకు వైఎస్‌కు అర్హత లేదా అనే డౌట్ సామాన్యులకు వచ్చేలా ఈ డిజైన్ ఉంది. ఇదేదో ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదు. జగన్ స్థాయిలోనే నిర్ణయం జరిగింది. అప్పుడైనా జగన్‌కు.. అయ్యో.. . మా నాయన ఫోటో కూడా ఉండాలే అని అనిపించలేదు. ఇంకా చెప్పాలంటే అలా ఉన్న డిజైన్ ను ఆయన తిరస్కరించి కొత్త డిజైన్‌ను ఖరారు చేసి ఉంటారని ఎక్కువ మంది అభిప్రాయం.
ఓ వైపు ఎన్టీఆర్ అని ఉన్న ప్రతీ చోట వైఎస్ఆర్ పేరు పెడుతూ .. మరో వైపు ప్రభుత్వ కార్యక్రమాలు.. కొత్తగా చేసే కార్యక్రమాలకు తన పేరు పెట్టుకునేందుకు జగన్ ఏ మాత్రం వెనుకాడటం లేదు. తాను ఏం చేసినా తన పేరు ఉండాలనుకుంటున్నారు. తండ్రి పేరు వద్దనుకుంటున్నారు. కానీ గత ప్రభుత్వాలు చేసిన వాటికి మాత్రం తన తండ్రి పేరు పెట్టేసుకుని వివాదం చేసుకుంటున్నారు.