సినీ నటుడు అలీ జనసేనలో చేరడం లేదని అమరావతిలోని వైసీపీవర్గాలు ఆయన పేరుతో ఓ ప్రకటన విడుదల చేశాయి. తాను పదవులు ఆశించి వైసీపీలో చేరలేదని జగన్ ను సీఎం చేయడానికే చేరానని.. మరోసారి జగన్ ను సీఎం చేయడానికి కృషి చేస్తానని అలీ పేరుతో వచ్చిన ప్రకటనలో ఉంది. మైనార్టీలకు ఏ సీఎం చేయనంత జగన్ చేశారనే రొటీన్ స్టేట్మెంట్ కూడా అందులో ఉంది.
నిజానికి అలీ పార్టీ మారుతున్నారన్న ప్రచారం పెద్దగా జరగలేదు. అంతర్గతంగా ఏమైనా చర్చలు జరుగుతున్నాయో లేదో స్పష్టత లేదు. కానీ వైసీపీ కి సంబంధించిన వారు మాత్రం అలీ పేరుతో ఓ ప్రకటన విడుదల చేసేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఆశతో వైసీపీలో చేరిన అలీకు జగన్ హ్యాండిచ్చారు. తర్వాత ఏదో పదవి అంటూ నాలుగేళ్ల పాటు టైంపాస్ చేసేశారు. ఏ పదవి దక్కలేదు. ఇటీవల రాజ్యసభ సభ్యత్వం వచ్చినట్లేనని జగన్ పిలిపించుకోవడంతో.. భార్యాసమేతంగా వెళ్లి సమావేశం అయి వచ్చారు. వారంలో గుడ్ న్యూస్ చెబుతామన్నారు కానీ.. ఆ వారం ఇంకా రాలేదు.
తర్వాత వక్ఫ్ బోర్డ్ అని.. మరొకటని ప్రచారం చేశారు. కానీ ఏ పదవి లేదు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు లేదా రాజమండ్రి సీట్లు కూడా ఇచ్చే ఉద్దేశంలో లేరు. వచ్చే ఎన్నికల్లోనూ సీటు దక్కదని తెలియడంతో అలీ. తన కోరికను తీర్చుకునేందుకు జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారం ఉంది. రాజమండ్రిలో జనసేనకు మంచి అవకాశాలు ఉన్నాయని సర్వేలు వస్తూండటంతో ఆ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా చెబుతున్నారు. అయితే వైసీపీ మాత్రం ముందుగానేఖండించారు. రేపోమాపో ఏదో ఓ నామినేటెడ్ పోస్టు ప్రకటించినా ఆశ్చర్యం లేదని వైసీపీ హడావుడి చూసిన వారికి అనిపిస్తోంది.