వైసీపీ విజయవాడ నాయకుడు పొట్లూరి వరప్రసాద్ అలియాస్ పీవీపీ మరో కేసులో ఇరుక్కున్నారు. ఈ సారి ఆయనపై ఫిర్యాదు చేసింది బీజేపీ నేత డీకే అరుణ కుమార్తె. తన ఇంటిలోకి అక్రమగా ప్రవేశించి..తన ఇంటి ప్రహరిగోడను కూల్చివేశారని ఆమె కేసు పెట్టారు. ఈ మేరకు పోలీసులు పీవీపీతో పాటు అతని అనుచరులపైనా కేసు పెట్టారు. బంజారాహిల్స్లో పీవీపీ ప్రేమ్ పర్వత్ విల్లాస్ అనే రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి అమ్మేసుకున్నారు. ఓ విల్లాలో మాత్రం తాను ఉంటున్నారు.
అయితే అక్కడ విల్లాలు కొనుక్కున్న వారంతా తాను చెప్పినట్లుగా బతకాలని దిశానిర్దేశం చేస్తున్నారు. ఎవరి ఇళ్లలోనూ ఎవరూ మార్పులు చేసుకోవద్దంటున్నారు. 2020 జూన్లో ఇలా ఇలా ఓ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి నిర్మాణాలు కూలగొట్టాలన్న కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను ప్రశ్నించడానికి వెళ్లిన పోలీసులపై కుక్కల్ని వదిలారు. పలుకుబడితో అరెస్ట్ కాకుండా తప్పించుకోగలిగారు. ఇప్పటికీ ఆ కేసు ఉంది.
ఇప్పుడు అదే విల్లాస్లో .. డీకే అరుణ కుమార్తె ఇంటిపైకి వెళ్లారు. మరో కేసు నమోదైంది. వైసీపీ అధికారంలో ఉందని.. సీఎం జగన్కు తాను సన్నిహితుడ్నని.. గొప్పగా ఫీలయ్యే పీవీపీ.. సోషల్ మడియాలో ఇతరు నేతల్ని దుర్భాషలాడటం.. తన వద్ద పని చేసే వారిని కిడ్నాప్ చేసి కొట్టడం వంటివి కూడా చేసి వివాదాల పాలయ్యారు. పలుకుబడితో అరెస్టుల నుంచి తప్పించుకుంటున్నారు.