సిట్టు .. బిట్టు అవసరం లేదు. మొత్తం తేలిపోయింది. చంద్రబాబును శిక్షించాల్సిందే అని తేల్చేస్తారు జగన్. “అదేంటి భయ్యా.. మీరు సుప్రీంకోర్టు సిట్ అడిగారు.. సుప్రీంకోర్టు సిట్ కూడా వేసింది. ఇప్పుడు అంతమాట అన్నారు. ఇప్పుడేం చెప్పుకోవాలి ” అని.. వైసీపీ నేతల మైండ్ బ్లాంక్ అయిపోయినా ఆయన తీరు అంతే. ఎందుకంటే జగన్ రెడ్డి మైండ్ సెట్ అదే. దొరికిపోయినా సరే అడ్డగోలుగా మాట్లాడటం .. అదీ కూడా కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడం ఆయన శైలి. ఒక్క తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలోనే కాదు ఆయన చేయించిన దోపిడీలు, ఖూనీలు, దాడులు.. ఇలా ప్రతి విషయంలోనూ ఆయనది అదే వాదన.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో జగన్ రెడ్డి వాదన ఏంటి?. ఆ కేసును పెద్దగా అనుభవం లేని కానిస్టేబుల్ తేల్చేస్తాడు. అంత సింపుల్ కేసును… తమకు ఇష్టమైన వారిని కాపాడేందుకు ఇతరుల్ని బలి చేసేందుకు అధికారాన్ని వాడుకున్నారు. నిందితుకు పూర్తి స్థాయి సపోర్టుగా ఉన్నారు. వాళ్లను పట్టుకుంటే తనవి మొత్తం బయటపడతాయని అనుకున్నారేమో కానీ.. తన వాదనను మాత్రం తగ్గించుకోలేదు. సాక్ష్యాలన్నీ కళ్ల ముందు కనిపిస్తున్నాయి కదా అంటే.. అవినాష్ రెడ్డి చెప్పిందే నమ్ముతానంటాడు.
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో తమ వాళ్లకు బీపీలు వచ్చాయని సమర్థించుకున్నారు. ఆర్ఆర్ఆర్పై హత్యాయత్నం కేసులో తమను విమర్శించారని చెప్పుకొచ్చారు. ఏదైనా తాము చేసింది కరెక్టేనన్న భావనతో ఆయన మాట్లాడుతూంటారు. ఎదురుగా కనిపిస్తున్న సాక్ష్యాలు.., తప్పుడు పనులకు పొందిన లబ్ది అన్నీ కళ్ల ముందు ఉన్నా అవే బొంకులు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కనీసం సుప్రీంకోర్టు సిట్ ను కూడా ఆయన ఆహ్వానించలేక.. తప్పుడు రిపోర్టు వస్తుందని ముందుగానే చెబుతున్నారంటే.. ఎంత అడ్డంగా దొరికిపోయారో అర్థం చేసుకోవచ్చు.
జగన్ రెడ్డి లాంటి మనస్థత్వం అత్యంత కరుడుగ ట్టిన నేరస్తులకు కూడా ఉండదు. పూర్తిగా దొరికిపోయిన తర్వాత కొంత మంది తలదించుకుంటారు. కానీ జగన్ రెడ్డి మాత్రం .. తాను చేసింది కరెక్టేనని వాదిస్తూనే ఉంటారు.