కుప్పంలో ఓటేయడానికి వెళ్తున్న ఉద్యోగుల కాళ్లు పట్టేసుకుంటున్నారు వైసీపీ నేతలు. వారి తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కుప్పంలో ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు వేసేందుకు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఉద్యోగులు చాలా మంది అక్కడకు వచ్చి ఓట్లేస్తున్నారు. పోలింగ్ కేంద్రం బ యట వైసీపీ నేతలు మకాం వేశారు. ఒకరేమో… రోడ్డు మీద నుంచి ఓటేయడానికి వచ్చిన వారిని ప్లీజ్.. ప్లీజ్ అని బతిమాలుతూ వస్తున్నారు. మరొకరు కొద్ది దూరంలో మోకాళ్ల మీద కూర్చుని ఉంటారు. మరొకరు ఇంకొంత దూరంలో సాష్టాంగ నమస్కారం పెడతారు. ఇది చూసి ఓటు వేసే వాళ్లకు కూడా విరక్తి పుడుతోంది.
ఒక్క కుప్పంలోనే కాదు అన్ని చోట్ల ఓట్ల కోసం కాళ్లు పట్టేసుకునేందుకు వైసీపీ నేతలు రెడీగా ఉన్నారు. ఇంత కాలం అరాచకాలు చేసి ఇప్పుడు కాళ్లు పట్టుకుంటామని వారు ముందుకకు రావడం చూససి ఓటర్లకు కూడా కలికాలం అంటే ఇదేనేమో అనుకుంటున్నారు. కాళ్లు పట్టుకున్నారని ఓట్లేస్తే రేపు కాళ్ల కింద కార్పెట్ లాగేస్తారని వారికీ తెలుసు. అందుకే ఎక్కువగా చీదరించుకున్నారు. అన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ వ్యతిరేకంగా పడిందని వైసీపీ నేతలు ఓ నిర్ణయానికి వచ్చారు.
పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చేందుకు వైసీపీ నేతలు పయత్నాలు చేస్తున్నారు. కొంత మంది డబ్బులు తీసుకున్నారు. అయితే చాలా తక్కువ ఓటింగ్ డబ్బుల ప్రభావంతో పడిందని మిగతా అంతా.. ఎక్కువ మంది సొంత నిర్ణయం ప్రకారమే ఓటేశారని భావిస్తున్నారు. ఉద్యోగుల విషయంలో ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో గుర్తు చేసుకుని దాని ప్రకారమే ఓట్లేశారని అంటున్నారు.