చేతిలో అధికారం ఉంది కదా అని అర్థరాత్రి అడ్డగోలుగా చంద్రబాబును అరెస్ట్ చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు లోకేష్ , పవన్ కల్యాణ్‌ను కూడా మూసేయిస్తామని బెదిరిస్తున్నారు. వీరికి సీఐడీ సంజయ్ కూడా జత కలిశారు. అసలు కేసుల్లో పేర్లు లేని లోకేష్ ను ప్రత్యేకంగా చెప్పి.. ఆయనను అరెస్ట్ చేస్తామన్నట్లుగా సంజయ్ చెప్పుకొచ్చారు. తర్వాత మంత్రులు మరింత చెలరేగిపోయారు. అంబటి రాంబాబు అయితే.. బ్రో సినిమా కలెక్షన్లపై విచారణ చేయించి. బ్రోను మూసేయిస్తామని బెదించారు.
మార్గదర్శి కేసుల్లో చట్టాలను , కోర్టులను కూడా పట్టించుకోని సీఐడీ చీఫ్.. ఏబేసిస్ తో లోకేష్ గురించి మాట్లాడారో తెలియద. స్కిల్ స్కాములో కూడా లోకేష్ ను ప్రశ్నించాల్సి ఉందని చెప్పడం కలకలం రేపింది. అలాగే మరో రెండు రాజధాని అలైన్ మెంట్ కేసు, ఫైబర్ నెట్ కేసుల్లోనూ లోకేష్ పేరు ఉందని ఆయన చెప్పారు. సీఐడీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగానూ చర్చనీయాంశమవుతున్నాయి. ఎందుకంటే లోకేష్.. ప్రస్తుతం సీఐడీ చీఫ్ సంజయ్ చెప్పిన మూడు కేసుల విషయంలో.. ఆయా మంత్రిత్వ శాఖల్లోనూ లేరు.
పలువురు మంత్రులు కూడా.. ఇలాగే హెచ్చరిక ప్రకటనలు చేశారు. లోకేష్ సంగతి కూడా చూస్తామన్నట్లుగా మంత్రులు ప్రకటనలు చేశారు. మంత్రి అంబటి రాంబాబు ఓ అడుగు ముందుకేసి.. బ్రోని కూడా మూసేస్ామని హెచ్చరించారు. అంటే పవన్ కల్యాణ్ నూ అరెస్ట్ చేస్తామని ఆయన బెదిరించినట్లయింది. సీఐడీ చీఫ్ సంజయ్ లోకేష్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తన్నారు. ఇది ప్రజాస్వామ్యమని.. జాగీరు కాదని.. అరెస్ట్ చేసి చూపించాలని అంటున్నారు.