జగన్ రెడ్డి ఓడిపోయినా ఇసుమంత కూడా మారలేదని తనను వదిలి పోతున్న పార్టీ నేతల గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు చేసిన వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయి. ఎవరు పోయినా పర్వాలేదని.. ప్రజల నుండే నేతలు పుడుతారని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉన్నా.. ఆయన మరో మాట కూడా చెప్పారు.. అదేమిటంటే.. ప్రజల కోపం నుండి పుట్టే ఓటు ఎవరిని అయినా కాల్చేస్తుందని చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డి ఉన్న పరిస్థితి చూస్తే.. ప్రజల కోపం నుండి పుట్టిన ఓటు ఆయనను కాల్సేసిందని ఆయనే సింబాలిక్ గా చెప్పుకున్నట్లు అయింది.
ఎక్కడ 151 సీట్లు.. ఎక్కడ 11 సీట్లు. ప్రజా తీర్పును ఎంత ఘోరంగా పరిహసించారో.. ప్రజలు ఈ స్థాయిలో పాతాళంలోకి తొక్కేశారంటే అర్థం చేసుకోవచ్చు. అయినా ఆయనలో అహంకారం ఏ మాత్రం తగ్గలేదు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వంపై కోపంతో తనకే ఓటు వేస్తారని అనుకుంటున్నారు. ఎవరు ఉన్నా లేకపోియనా.. తాను నిలబెట్టిన వారికే ఓట్లు వేస్తారని అనుకుంటున్నారు. అంటే ఇప్పటికీ పార్టీ నిర్మాణం.. తన తో నమ్మకంగా ఉన్న నేతలను ఆయన కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదన్నమాట.
తనతో నడిచిన వారు పదవుల కోసం.. నడిచారని.. తన వల్లే వారు లబ్ది పొందారు కానీ.. వాళ్ల వల్ల తనకు ఎలాంటి లాభం కలగలేదని జగన్ రెడ్డి అనుకంటున్నారు. ప్రజలు వేసే ఓట్ల తనకేనని ఆయన ఇప్పటికీ అనుకుంటున్నారు. ఇలాంటి అహంకారం ఉన్న నేతలు సుదీర్ఘ రాజకీయాలు చేసిన రాజకీయం చరిత్రలో లేదు. ఆయనను అంటి పెట్టుకుని ఉండే నేతలకు ఈ తత్వం బోదపడుతుందో లేదో మరి .