వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యిని తీసుకొచ్చి చేసింది కాకుండా .. ఎలాంటి తప్పు చేయలేదని ఎదురుదాడికి దిగుతున్నారు. ప్రమాణం చేస్తానంటూ వైవీ సుబ్బారెడ్డి పిల్లిమొగ్గలేస్తూ మీడియా ముందుకు వచ్చారు. ఆధారాలుంటే బయట పెట్టాలని సవాల్ చేశారు. మొత్తం ల్యాబ్ రిపోర్టుల్ని టీడీపీ బయట పెట్టిన తర్వాత .. ఎలా సమర్థించుకోవాలో తెలియక ల్యాబ్‌కు పంపిన తేదీని చూపించి అడ్డగోలు వాదనలకు తెగబడే ప్రయత్నంలో ఉన్నారు.
తిరుమల లడ్డూలకు దశాబ్దాలుగా కర్ణాటకలో స్వచ్చమైన ఆవుపాలను సేకరించే ప్రభుత్వ సంస్థ నందిని బ్రాండ్ ఆవు నెయ్యిని సేకరించేవారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక..అతి తక్కువ రేటు సరఫరాకు యూపీ కంపెనీలకు ఆర్డర్ ఇచ్చింది. అంత భారీ నెయ్యిని ఆ కంపెనీలు ఎలా తెస్తాయో కనీసం పరిశీలన చేయలేదు. తక్కువకు ఇస్తారని కాంట్రాక్ట్ ఇచ్చేశారు. ఆ నెయ్యి వెనుక ఎంత గూడు పుఠాణి ఉందో కానీ పాపం పండింది. ఇప్పుడు విషయం బయటపడటంతో .. ప్రమాణాలు.. పరువునష్టం కేసులు అంటూ పెడబొబ్బలు పెడుతున్నారు.
అధికారం వచ్చింది కదా అని.. ఇష్టం వచ్చినట్లుగా దేవుడిని దోపిడీ చేస్తే.. ఆయన భక్తుల్ని వంచిస్తే.. దేవుడు తప్పక శిక్షిస్తాడు. కాస్త ఆలస్యం కావొచ్చు. తిరుమలను ఏ మాత్రం సంకోచించకండా అపవిత్రం చేసి.. ఇప్పుడు సిగ్గు లేకుండా ఎదురుదాడికి దిగే ప్రయత్నంలో ఉన్నారు. వైవీ సుబ్బారెడ్డి అన్యమతస్తుడు.. ఆయన భార్య బైబిల్ పఠనంలో మునికి తేలుతూంటారు. ఇద్దరూ కలిసి తిరుమలలోనే తిష్ట వేసి.. జగన్నామ స్మరణ చేసేవారు. మొత్తంగానికి పాపం పండింది.. శిక్ష మిగిలింది.