ఏపీలో నామినేషన్ల సందడి తొలి రోజు అంతా పసుపు హడావుడి కనిపించింది. కూటమిలోని పలువురు కీలక నేతలు తొలి రోజు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్లు దాఖలు చేశారు. నారా లోకేష్ కూడాతొలి రోజే నామినేషన్ వేశారు. కూటమి తరపున కీలక నేతలు కూడా నామినేషన్ వేశారు. విజయవాడ పశ్చిమ నుంచి సుజనా చౌదరి ఊహించని రీతిలో ర్యాలీ నిర్వహించారు. కీలక నేతలందర్నీ నామినేషన్లకు ఆహ్వానించారు. వంగవీటి రాధా సహా అందరూ వచ్చారు.
ఉరవకొండ నుంచి విశాఖ వరకూ టీజీపీ, జనసే నేతలు నామినేషన్ల తొలి రోజే తమ ర్యాలీలు భారీగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ వారం రోజుల పాటు ప్రతి రోజూ.. ఇలాగే హంగామా ఉండేలా .. కూటమి నేతలు ప్లాన్ చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. వైసీపీ అధినేత టిక్కెట్లు ఖరారు చేసినా ఇంకా బీఫాంల గురించి బయటకు రాలేదు. దీంతో సెంటిమెంట్ ప్రకారం.. మూహుర్తం చూసుకుని బాగుందనుకున్న కొంత మంది నామినేషన్లు వేశారు.
వేసిన అతి కొద్ది మంది కూడా..పెద్దగా ర్యాలీలు చేయలేకపోవడంతో పెద్దగా హైలెట్ కాలేదు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ఎన్డీఏ కూటమి నేతలు.. జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సీఎం జగన్ మాత్రం రోజు మార్చి రోజు విరామంతో బస్సు యాత్ర చేస్తూ..రోజూ చెప్పే బటన్ల కథలను చెబుతున్నారు. దీంతో వైసీపీ పూర్తి స్థాయిలో వెనుకబడిపోయిందన్న అభిప్రాయం తొలి రోజే వ్యక్తమయింది.