వైసీపీ మార్క్ శవరాజకీయాలు ఏ మాత్రం తగ్గడండ లేదు. ఏదైనా విషాదం జరగగానే వెళ్లి బాధితులకు డబ్బులు ఇచ్చి చంద్రబాబును తిట్టమని చెబుతున్నారు. వీడియోల ముందు తిట్టమని కవర్ల నిండా డబ్బులు ఇస్తున్న వైనం తాజాగా తిరుపతి స్విమ్స్‌లో బయటపడింది. ఈ విషయాన్ని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు . జగన్ ఆస్పత్రికి రాక ముందు ఓ లీడర్ బాధితుల వద్దకు వెళ్లాడని.. వారందరికీ కవర్లు ఇచ్చి ..జగన్ వచ్చి పరామర్శిస్తున్నప్పుడు చంద్రబాబును, ప్రభుత్వాన్ని తిట్టాలని చెప్పి వచ్చినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డయిందని ఆనం చెప్పారు.
ఈ అంశాన్ని స్విమ్స్ సిబ్బంది కూడా గమనించారని తెలిపారు. ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపేవే. వైసీపీ నేతల వికృత రాజకీయాలకు.. శవ రాజకీయాలకు ఎలా తెగిస్తున్నారో ఈ ఘటన తెలుపుతుందన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. అక్కడ జరిగింది ఒకటి అయితే.. ఏదో జరిగిపోయిందన్న ప్రచారం చేయడానికి ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం ఉందని చూపించడానికి డబ్బులు వెదజల్లడానికి వైసీపీ నేతలు సిద్దపడిపోతున్నారు.
జగన్ తిరుపతికి వస్తే పట్టుమని రెండు వందల మందిని కూడా సమీకరించలేకపోయారు. ఎవరూ పట్టించుకోలేదు. అయినా ఆస్పత్రిలోకి దూసుకెళ్లి రోగుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. శవాలు దొరికితే చాలన్నట్లుగా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.