పార్టీ నుంచి పోతున్నారని ప్రచారం జరుగుతున్న వారంతా ఖండించాలని వైసీపీ ఆఫీసు నుంచి మెసెజులు వెళ్లాయి. నిజానికి పార్టీ ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరిపై ఇలాంటి రూమర్స్ వచ్చాయి. చివరికి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, వైవీ సబ్బారెడ్డిపైనా వచ్చాయి. దీంతో అందరూ పార్టీ ఆఫీసుకు వచ్చి ప్రెస్మీట్ పెట్టి ఖండించాలని లేకపోతే..తామున్న చోట అయినా ప్రెస్మీట్ పెట్టి వైసీపీలోనే కొనసాగుతామని.. జగన్ రెడ్డి తమకేమీ అన్యాయం చేయలేదని చెప్పాలని స్క్రిప్ట్ పంపారు.
ఇలాంటి స్క్రిప్ట్ అందుకున్న తర్వాత విజయసాయిరెడ్డి ట్వీట్ పెట్టారు. రామచంద్రాపరం నుంచితాడేపల్లికి వచ్చిన రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రెస్మీట్ పెట్టారు. వైసీపీకి ద్రోహం చేయనని ఆయన ఖరాఖండిగా చెప్పారు. ఆయనే తన కొడుక్కి అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వకపోతే జనసేనలో చేరిపోతానని బ్లాక్ మెయిల్ చేసి టిక్కెట్ ఇప్పించుకుంది ఈయనే. హైదరాబాద్లో ఆర్ కృష్ణయ్య తనను సంప్రదించిన కొంత మంది జర్నలిస్టులకు తన గురించి తెలిసిన వారెవరూ.. తాను పార్టీ మానతానంటే నమ్మరు అనే స్టేట్ మెంట్ ఇచ్చారు. కానీ ఆయన టీడీపీ.. కాంగ్రెస్.. చివరిగా రాజ్యసభ సభ్యత్వం కోసమే వైసీపీలో చేరారు.
ఇక మేడా రఘునాథరెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి,గొల్ల బాబూరావు సహా మిగిలిన ఎంపీలు స్పందించలేదు. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయడంతో ఇక తొమ్మిది మందే మిగిలారు. వీరిలో ఎంత మంది ఉంటారో తెలియని పరిస్థితి. మరో వైపు ఎమ్మెల్సీలు కూడా రాజీనామా బాటపడుతున్నారు. శుక్రవారం.. కర్రి పద్మ, బల్లి కల్యాణ్ చక్రవర్తి రాజీనామాలు చేశారు. మరికొందరు ఇప్పటికే టీడీపీతో టచ్ లోకి వెళ్లిపోయారు. వీరికీ ఖండించమని సూచనలు వెళ్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.