పవన్ కల్యాణ్‌పై ప్రభుత్వం పై విమర్శలు చేయగానే.. కట్లు తెంచేసినట్లుగా ఎగబడటానికి రెడీగా ఉండే పేర్ని నాని, కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్ వంటి వారు మొహమాటం లేకుండా చిరంజీవిపై అదే తరహా దాడి చేస్తున్నారు. ముందుగా పేర్ని నాని మీడియా ముందుకు వచ్చారు. పరోక్షంగా చిరంజీవని పకోడిగాడు అన్నట్లుగా మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్లు పకోడీగాళ్లు తాము ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారంటూ ఘాటుగా స్పందించారు. తనవాళ్లకు కూడా ఈ సలహాలు ఇస్తే బావుంటుందన్నారు. ‘మనకెందుకురా బాబు మన డ్యాన్సులు , ఫైట్లు మనం చూసుకుందామని వాళ్లకు కూడా సలహా ఇస్తే మంచిది’ అన్నారు.
తాను చిరంజీవి అభిమానిని అంటూ మీడియా ముందు ప్రారంభించిన పేర్ని నాని కూడా చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఓ మంత్రిపై కక్షతో సినిమాలో పాత్రలు పెట్టారని, మరి ఎదుర్కోక తప్పదంటూ చిరుకు పేర్ని హెచ్చరికలు పంపారు.గిల్లితే గిల్లించుకోవాలి అని సినిమా లో చెప్పినట్టు ఉండదన్నారు. బాహ్య ప్రంపంచంలో గిల్లినపుడు గిల్లుతారన్నారు. ఇది సినిమా కాదని చిరంజీవికి గుర్తుచేశారు. రెమ్యునరేషన్ గురించి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. చిరంజీవి రెమ్యునరేషన్ గురించి ఎవరైనా మాట్లాడారా అని పేర్నినాని ప్రశ్నించారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ప్రత్యేక హోదా పై ఏం చేశారంటూ నిలదీశారు. ఇప్పుడు ప్రత్యేక హోదా అడుగుతున్నారని ఆక్షేపించారు.
ఇక విచిత్రంగా స్పందించే బొత్స సత్యనారాయణ అన్నీ విషయాలు వదిలేసి.. చిత్రపరిశ్రమ పిచ్చుక అని అంగీకరించారా అని .. చిరంజీవిని ప్రశ్నించారు. మిగతా విషయాలపై మాత్రం స్పందించలేదు. అంతా చూసిన తర్వాత స్పందిస్తానన్నారు. మొత్తంగా చిరంజీవిని పవన్ లాగే టార్గెట్ చేయాలని డిసైడయ్యారు..
ఇంత కాలం తాము చిరంజీవిపై చూపించిన అభిమానం అంతా ఉత్తుత్తిదేనని.. చిరంజీవి భుజంపై తుపాకీ పెట్టి పవన్ ను కాల్చే ప్రయత్నం చేశామని అది ఫెయిలయిందని తేలడంతో ఇప్పుడు ఎటాక్ చేస్తన్నారని స్పష్టమవుతోందని ముందు ముందు మరింత ఎక్కువగా దాడులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.