వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా హైకోర్టు వైపు పరుగులు పెడుతున్నారు. ఒకరు ముందస్తు బెయిల్ కావాలని.. మరొకరు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని.. ఇంకొందరూ అదే లైన్ లో ఉన్నారు. వరుసగా వైసీపీ నేతలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తుండటంతో అసలు వారు లీడర్లా..? ఆకతాయిలా..? అనే చర్చ జరుగుతోంది.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఇక, వాలంటీర్ల ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేస్తారనే అనుమానంతో కొడాలి నాని కూడా హైకోర్టుకు వెళ్లారు. రేపో, మాపో జోగి రమేష్ తోపాటు మరికొంతమంది వైసీపీ నేతలు న్యాయస్థానాల వైపు పరుగులు తీయడం ఖాయంగా కనిపిస్తోంది.
అధికారంలో ఉన్నన్నాళ్ళు పట్టపగ్గాలు లేకుండా రౌడియిజం ప్రదర్శించారు. ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి హైరానా పడుతున్నారు. ఎప్పుడు ఎలాంటి ముప్పు ముంచుకోస్తుందోనని అరెస్ట్ ల నుంచి తప్పించుకునేందుకు న్యాయస్థానాల వైపు వడివడిగా అడుగులేస్తున్నారు.
పవర్ ఉన్నప్పుడు కాస్త ప్రజాస్వామికంగా వ్యవహరించి ఉంటే ఆ పార్టీ నేతలు ఇప్పుడూ దర్జాగా ఉండేవారు. కానీ అప్రజాస్వామిక విధానాలు, రాజకీయ లబ్ది కోసం అధికారాన్ని వాడుకోవడమే వారికి ఇప్పుడు చిక్కులు తెచ్చిపెట్టింది.