వైసీపీ రాజకీయాలు అత్యంత హీన స్థితికి చేరిపోతున్నాయి. తమతో పోరాడుతున్న నేతల్ని ఎదుర్కోలేక.. వారి కుటుంబంలోని ఆడవాళ్లను టార్గెట్ చేసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ విషయంలో ఇది మరీ దారుణంగా ఉంటోంది. ఊరూ పేరూ లేని పనికి మాలిన వాళ్లతో కూలి మీడియాతో ఇంటర్యూలు చేయించి… ఇంట్లో ఆడవాళ్ల మీద కామెంట్లు చేయిస్తున్నారు. వాటిని వైసీసీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంచేస్తున్నారు.
చక్రవర్తి అనే ఎవరికీ తెలియని వైసీపీ నేతను కాపు నాయకుడిగా చూపిస్తూ ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్యూ చేసింది. అందులో పవన్ కల్యాణ్ తల్లిపై అత్యంత నీచమైన ఆరోపణలు చేశాడు ఆ చక్రవర్తి. అసలు రాజకీయాల్లోకి ఆమెను తీసుకు రావాల్సిన అవసరం ఏమిటో తెలియదు. పవన్ కల్యాణ్ ది కాపు సామాజికవర్గం కాదని చెప్పడానికి…. ఆయన తల్లిని రాజకీయంలోకి తీసుకు వచ్చారు. ఆ ఇంటర్యూ చూసిన జనసైనికులు కూడా… ఇంత దారుణంగా మాట్లాడతారా అని.. అదీ కూడా రాజకీయాలతో సంబంధం లేని… మహిళ గురించి. ఆమె పవన్ కల్యాణ్ తల్లి మాత్రమే కాదు.. .మెగాస్టార్ చిరంజీవి తల్లి అని కూడా. అయినా వారు వదలడం లేదు. మళ్లీ కాపు నాయకుడనే ట్యాగ్ పెట్టుకుంది.
ఇక సీఎం జగన్ భార్య భారతి పులివెందుల పీఏ వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియా పోస్టులు పూర్తిగా పవన్ కల్యాణ్ కుటుంబాన్ని కించపర్చడానికే. తాము ఎవర్ని ఏమన్నా ఈగ వాలదన్న ధీమా వారిని విచ్చలవిడి తనాన్ని ప్రదర్శించడానికి కారణం అవుతోంది. రాష్ట్రం వైసీపీ నేతలు ఏం చేసినా పడి ఉండాల్సిందేనన్నట్లుగా ఉంది. విపక్ష నేతలు ప్రభుత్వాన్ని విమర్శిస్తే చాలు అర్థరాత్రి వచ్చి పట్టుకుపోయే పోలీసులు ఇలా కుటుంబ మహిళల్ని సోషల్ మీడియాలో వేధిస్తున్నా పట్టించుకోవడం లేదు.
భరించే వాళ్లు భరించినంత కాలం భ రిస్తారు. కానీ తర్వాత తిరగబడితే… చట్టం న్యాయం ఏమీ పట్టించుకోరు. అరాచకం ఏర్పడుతుంది. అప్పుడు వ్యవస్థ ఫెయిలయినట్లవుతుంది. దీనికి బాధ్యత పోలీసు శాఖదే అవుతుందని ఇతర పార్టీల నేతలు హెచ్చరిస్తున్నారు.