వైసీపీ నేతలు అటెన్షన్ డైవర్షన్ లో రాటుదేలిపోయారు. ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి రోజు మీడియా ముందుకు వచ్చి గెలుస్తాని నీరసంగా చెబుతున్నారు. అయితే అసలు స్కెచ్ మాత్రం వేరే ఉందని వైసీపీలో జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. మొత్తంగా కీలక నేతలంతా సర్దుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది ఏర్పాట్లు పూర్తి చేసుకోగా.. మరికొంత మంది అదే ప్రయత్నాల్లో ఉన్నారు. వీరిలో సజ్జల కూడా ఉండటమే అసలు ట్విస్ట్.
కుమారుడ్ని ఆజ్ఞాతంలోకి పంపేసిన సజ్జల
పోలింగ్ ముగిసిన తర్వాత రోజు వైసీపీ సోషల్ మీడియా ఆఫీస్‌ను క్లోజ్ చేశారు. ఎవరూ ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదని సందేశాలు పంపారు. వచ్చే నెల వరకూ సెలవులు ఇచ్చామని కొంత మంది.. పూర్తిగా తీసేశామని మరికొంత మందికి సమాచారం ఇచ్చారు. సజ్జల భార్గవరెడ్డి అసలు ఎవరికీ అందుబాటులో లేరు. అంత గెలుస్తామన్న నమ్మకం ఉంటే సోషల్ మీడియా ఆఫీసుని పీకేసుకుని పరారు కావాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా, సజ్జల భార్గవ్‌పై ఈసీ ఆదేశాలు కేసు కూడా నమోదయింది. ప్రభుత్వం మారాల్సిన అవసరం లేకుండా.. ఫలితాలు వచ్చిన రోజునే బడితే పూజ ఉంటుందన్న భయంతో సోషల్ మీడియా ఆఫీసును క్లోజ్ చేసుకుని పరారైనట్లుగా తెలుస్తోంది.
సైలెంట్ గా ఆస్తులు, వ్యాపారాలు సేఫ్ జోన్‌కు పంపుతున్న పెద్దిరెడ్డి
వైసీపీలో క్యాష్ కింగ్‌గా పేరున్న పెద్దిరెడ్డి సైలెంట్ అయిపోయారు. ఎన్నికలకు రెండు వారాల ముందు నుంచీ ఆయన నోట్లో నుంచి మాట రావడం లేదు. పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా మాట్లాడటం లేదు. కానీ ఆయన తన కాంట్రాక్ట్ కంపెనీలకు ప్రభుత్వం నుంచి రావాలసిన నిధులను మాత్రం రాబట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో సక్సెస్ అయ్యారని అంటున్నరు. అదే సమయంలో తన ఆస్తులు, వ్యాపారాలను ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్నారు. భారీ యంత్రాలు.. ఇతర సామాగ్రి.. వందల కొద్దీ ఉన్న లారీలు అన్నీ తరలించేస్తున్నారు. ఈ తరలింపును పూర్తి చేసి ఫలితాలు వచ్చే రోజుకు తాము కూడా ఆజ్ఞాతంలోకి వెళ్లాలని పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు ప్లాన్ చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
బూతుల నేతలంతా కౌంటింగ్ రోజు ఏపీలో ఉండరు !
ఇక వైసీపీలో బూతుల నేతలుగా పేరుపొందిన చాలా మంది కౌంటింగ్ రోజున ఏపీలో ఉండకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. కొంత మంది తాము ఎక్కడ ఉంటామో ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంటలిజెన్స్ సూచనలు చేసిందని వారు కౌంటింగ్ కేంద్రాల వరకూ రాకుండా.. అనుచరుల్ని పంపి పరారయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటికే వారెవరూ మాట్లాడటం లేదు.