హత్య కేసుల్లో చిక్కుకుని జైళ్లలో మగ్గుతున్న వైసీపీ ప్రముఖ నేతలకు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోనూ బెయిల్ లభించడం లేదు. దళితుడ్ని హత్య చేసి ఏకంగా డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు .. తనపై పోలీసులు తొంభై రోజుల వరకూ చార్జిషీట్ దాఖలు చేయలేదు కాబట్టి బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. మరో వైపు వైఎస్ వివేకా కేసులో కీలక నేరస్తుడయిన శివశంకర్ రెడ్డి సుప్రీం కోర్టులో దాఖలుచేసుకున్న బెయిల్ పిటిషన్‌నూ తోసిపుచ్చింది. బెయిల్ ఇవ్వడానికి కారణాలు తమకు కనిపించడం లేదని స్పష్టం చేసింది.
నిజానికి వీరిద్దరూ నొటోరియస్ క్రిమినల్స్‌గా ఆరోపణలు ఉన్నాయి. వీరిద్దరికీ ఏపీ ప్రభుత్వ అండ స్పష్టంగా ఉంది. ఎమ్మెల్సీ అనంతబాబు కేసును పోలీసులు అసలు దర్యాప్తు చేయడం లేదు. పైగా ఆయనకు సపోర్టుగా రిపోర్టులు ఇస్తున్నారు. చివరికి పోలీసులు దర్యాప్తు చేయడంలేదని.. అధికార పార్టీ ఎమ్మెల్సీ అయినందున.. ఇలా చేస్తున్నారని సీబీఐకి ఇవ్వాలని హైకోర్టులో హతుడైన దళిత కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడా కేసు విచారణలో ఉంది. ఇటీవల కుటుంబసభ్యులు చనిపోయారని బెయిల్ పై విడుదలైన అనంతబాబు రెండు వారాలకుపైగా బయట ఉన్నారు. తర్వాత బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమై జైలులో సరెండర్ అయ్యారు.
శివశంకర్ రెడ్డి జైల్లో ఉంటూ చేస్తున్న పనులుపై సీబీఐ అధికారులు రకరకాలుగా కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నారు. వారు బాధితులపైనా ఎదురుదాడి చేస్తున్నారు. వైఎస్ వివేకా ఫ్యామిలీపై ప్రైవేటు కేసులు వేస్తున్నారు. ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షులందర్నీ బెదిరిస్తారని సీబీఐ అధికారులు పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు వారికీ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. రాజకీయ నాయకులు రాజకీయ పోరాటంలో జైలుకెళ్లడం కామన్. కానీ వైసీపీ నేతలు మాత్రం దారుణమైన హత్యలు చేసి జైలుకెళ్లి.. గొప్ప ఘనకార్యాలు చేసినట్లుగా ఫీలవుతూంటారు. ఆ పార్టీ నేతలకు అదే ట్రీట్ మెంట్ ఇస్తూంటారు.