ఎక్కడున్నారో పట్టుకున్నారు. చితక్కొట్టారు. వీడియో తీశారో.. ఎవరికైనా లైవ్లోచూపించారో తెలియదు కానీ .. ఆయనను కొడుతూంటే.. నలుగురు, ఐదుగురు ఫోన్లు ఆన్ చేసి పెట్టి.. రికార్డు చేయడం స్పష్టంగా కనిపించింది. తర్వాత ఓ వీడియోను సోషల్ మీడియాలోపోస్టు చేశారు. ఈ అరాచకత్వం అంతా ఒంగోలులో జరిగింది., దాడికి గురైన వ్యక్తి వైసీపీ నేతగా గుర్తింపు పొందిన సుబ్బారావు గుప్తా. దాడి చేసింది.. వైసీపీ నేత .. సుభాని. ఇద్దరూ మంత్రి బాలినేనికి సన్నిహితులే. సుబ్బారావుగుప్తా చేసిన తప్పేమిటంటే… ఆడవాళ్లను వైసీపీ నేతలు తిట్టడం సరి కాదనిచెప్పడం.
ఆదివారం సుబ్బారావు గుప్తా ఇంటిపై దాడి చేసిన వైసీపీ నేతలు .. ఆయన దొరకకపోవడంతో ఇంట్లో వారిని బెదిరించి వెళ్లిపోయారు. తర్వాత వారు.. గుప్తాను ఓ లాడ్జిలో ఉండగా పట్టుకున్నారు. చితక్కొట్టి.. మోకాళ్లపై కూర్చోబెట్టి మంత్రి బాలినేనికి క్షమాపణలు చెప్పించారు. ఆ తర్వాత మంత్రి బాలినేని కూడా స్పందించారు. తనది దాడి చేయించే మనస్థత్వం కాదని.. అయితే తమ వారుదాడి చేస్తున్నారని తెలిసి వద్దనిచెప్పినట్లుగా చెప్పుకొచ్చారు. అంటే.. సుబ్బారావు గుప్తాను కొడుతున్నప్పుడు మంత్రి బాలినేని లైవ్లో చూశారన్నమాట. సుబ్బారావు గుప్తా తనకు తెలుసని.. ఆయన దామచర్ల జనార్దన్ ప్రోద్బలంతో మాట్లాడి ఉండవచ్చని కవర్ చేసుకున్నారు.
తాము టీడీపీ వాళ్లపైనే ఎప్పుడూ దాడి చేయలేదని చెప్పుకొచ్చారు. సొంతపార్టీ నేతను ఇంత దారుణంగా కొట్టిన వైసీపీ నేతల తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇలాంటిదాడి జరిగినా పోలీసులు కనీసం పట్టించుకోకపోవడం విమర్శలకు కారణం అవుతోంది. ఆర్యవైశ్య సంఘాలు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.