ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా ఫీజు రీఎంబర్స్ మెంట్ సహా అనేక పథకాల నిధులు పెండింగ్ లో ఉండిపోయాయి. జగన్ రెడ్డి గత మూడు నెలలుగా బటన్లు నొక్కుతున్న పథకాల డబ్బులు అకౌంట్లలో జమ కావడం లేదు. ఆ డబ్బులు ఇప్పుడేస్తామని అనుమతి కావాలని ఈసీకి లేఖలు రాశారు. కానీ ఈసీ అంత కామెడీలు వద్దన్నట్లుగా రిప్లై పంపింది.
తుఫాను, కరువు కారణంగా దెబ్బతిన్న రైతులకు అందే ఇన్పుట్ సబ్సిడీ ఇప్పుడు విడుదల చేస్తామని ప్రభుత్వం లేఖ రాసింది. ఖరీఫ్ కు సన్నద్ధమవుతున్న రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పుకొచ్చింది. అలాగే విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇస్తామని అడింగి. పోలింగ్ కు మరో వారం రోజులు ముందు పెట్టుకుని పోలింగ్ రోజు డబ్బులేసేందుకు ఈసీ అంగీకరించే అవకాశం ఉండదు. ఆ విషయం తెలిసినా …. వైసీపీ ఇలా పెండింగ్ డబ్బులిస్తామని ఈసీని అడిగింది.
నిజానికి ప్రభుత్వం వద్ద డబ్బులున్నాయో లేదో ఎవరికీ తెలియదు. ఈ నెలలో ఇప్పటికే ఆరు వేల కోట్లు అప్పులు చేశారు. ఉద్యోగులకు కోపం వస్తుందని మేడే రోజు అయినా ఒకటో తేదీనే జీతాలు వేశారు. గత మూడు నెలలుగా బిల్లులు క్లియర్ చేసుకోవడానికి ప్రాధాన్యమిచ్చారు. ఇప్పుడు డబ్బులు లేకపోయినా.. టీడీపీ అడ్డుకుందని చెప్పడానికి.. పనికొస్తాయని ఈసీకి లేఖలు రాశారు. చివరికి అది రివర్స్ అయింది.