మనం చేసిన దానికి రివర్స్‌లో అనుభవించక తప్పదు అని వైసీపీని చూస్తే అందరికీ అర్థమైపోతుంది. తాము ఇలా చేస్తే గతంలో మీరు చేశారు కదా అని అందరూ మొహం మీదే విమర్శిస్తారని తెలిసినా వైసీపీకి తప్పడం లేదు. ఏపీలో కేబుల్ ఆపరేటర్లు టీవీ9, ఎన్టీవీ, టెన్ టీవీ, సాక్షి టీవీలను స్వచ్చందంగా ఆపేశారు. ఏపీ ఫైబర్ నెట్లో కూడా ఆపేశారు. దీంతో వైసీపీ తరపున ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి ట్రాయ్‌కు కు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా.. ఆ చానళ్లను రాకుండా ఆపేశారని వెంటనే ప్రసారం అయ్యేలా చూడాలని కోరారు.
గతంలో జగన్ అధికారంలోకి రాగానే ఏబీఎన్, టీవీ5, మహా వంటి చానళ్లను నిలిపి వేశారు. వారు తగ్గలేదు. తమకు ఉన్న అన్ని మార్గాల్లో పోరాడారు. ట్రాయ్ నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కానీ ప్రభుత్వం వేధిచినంత కాలం వేధించింది. ఇక తప్పనిసరి ఇవ్వక తప్పదన్నప్పుడు వదిలేశారు. నిజానికి కేబుల్ ఆపరేటర్లు ఇచ్చారు. కేబుల్ ఆపరేటర్లపై బెదిరింపులకు పాల్పడి ఆపివేయించారు. ఫైబర్ నెట్ లో చివరి వరకూ రాలేదు.
కానీ ఇప్పుడు ఎన్నికల ఫలితాలు రాగానే .. ఏపీకి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్నారని ఆ నాలుగు చానళ్లను కేబుల్ ఆపరేటర్లే నిలిపివేశారు. చంద్రబాబు ఇంకా ప్రమాణం చేయలేదు. ఎవరూ పట్టించుకోలేదు. టీడీపీ నేతలు కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి చేయలేదు. ఇప్పుడు ఆ నొప్పేంటో… వైసీపీకి తెలుస్తోంది. గత తాము యా పని చేయకపోతే.. ఇప్పుడు తమ మద్దతు చానళ్లు ఈ గతి పట్టి ఉండేది కాదు.
అయినా తమ చానళ్లు ఆపేశారని న్యాయం చేయాలని ఆ చానళ్ల యాజమాన్యాలుట్రాయ్ దగ్గరకు పోవాలి కానీ.. వాటి తరపున వైసీపీ పోవడమే ఇక్కడ అసలైన రాజకీయం కనిపిస్తోంది. ఈ మాత్రం లాజిక్ వైసీపీ పెద్దలకు అర్థం కాదేమో ?