ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావడం నిర్మాణ రంగానికి ఎంతో మేలు చేస్తోంది. సొంతంగా ఇల్లు కట్టుకునేవారి బడ్జెట్ను చాలా వరకూ తగ్గిస్తోంది. అయితే వైసీపీకి మాత్రం ఈ విధానం కంట్లో ఇసుక పడినట్లుగా అయింది. కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లను వెనక్కి పంపేయడం.. ఇప్పటి వరకూ చేసిన దోపిడీ అంతా బయటపడుతూండటంతో.. సోషల్ మీడియా వేదికగా ఉచిత ఇసుకపై తప్పుడు ప్రచారం ప్రారంభించారు.
ఇసుక ఉచితం కాదని డబ్బులు కట్టాలని ప్రచారం ప్రారంభించారు. ప్రభుత్వం ఇసుకకు రూపాయి కూడా తీసుకోవడం లేదు. లోడింగ్, ఆన్ లోడింగ్, రవాణాచార్జీలకు మాత్రమే తీసుకుంటోంది. వీటిని లారీలు, ట్రాక్టర్ల ఓనర్లకు వదిలేయకుండా.. ప్రభుత్వమే ధరలు నిర్ణయించి రెగ్యూలేట్ చేస్తోంది. ఆ మొత్తం కూడా ఆన్ లైన్ ద్వారా తీసుకుంటున్నారు. మధ్యలో ఎక్కడా ఎవరికీ రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకండా పోయింది.
ఈ విధానంపై తప్పుడు ప్రచారం చేస్తూ.. లోడింగ్, అన్ లోడింగ్, రవాణా చార్జీలు కూడా ప్రభుత్వమే భరించాలన్నట్లుగా ప్రచారం చేయడం ప్రారంభించారు. గతంలో పెద్ద టన్ను లారీ ఇసుకకు యాభై వేలు వదిలించుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అది పదివేలకే వస్తోంది. దూరాన్ని బట్టి కాస్త పెరగవచ్చు కానీ.. ఇంటి నిర్మాణ దారులకు భారీగా డబ్బులు ఆదా అవుతున్నాయి. ఈ విషయం ఇసుక తీసుకెళ్లేవారికి తెలుసు. అయినా వైసీపీ సోషల్ మీడియా హోరులో కొంత మంది టీడీపీ సానుభూతిపరులు కూడా కొట్టుకుపోవడంతో ఈ అంశంపై విస్తృత చర్చ జరిగింది.
విద్యుత్ వైట్ పేపర్ రిలీజ్ సమయంలో చంద్రబాబు కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఇసుక ఫ్రీ అంటే.. రవణా చార్జీలు కూడా ప్రభుత్వమే పెట్టుకుంటుందని వైసీపీ చెబుతోందని.. వారికి సిగ్గుండాలని మండిపడ్డారు. బయట ఎలా ప్రచారం చేసినా.. వైసీపీ ఇసుక బాధితులకు మాత్రం తేడా
స్పష్టంగా కనిపిస్తోంది.