వైసీపీ నేతలు ఎంత దారుణమైన రాజకీయం చేస్తున్నారో.. మరోసారి స్పష్టమయింది. పాలసీలను ప్రశ్నిస్తే.. వైఫల్యాలను ఎండగడితే వ్యక్తిగత జీవితాలను.. కుటుంబసభ్యులను తెచ్చి బూతులు తిట్టడం తప్ప తమకేమీ చేతకాదని మరోసారి వైసీపీ నేతలు నిరూపించుకున్నారు. ఎందుకీ గర్జనలు అంటూ పవన్ కల్యాణ్ వరుసగా చేసిన పాతిక ట్వీట్లతో వసీపీ నేతల మైండ్ బ్లాంక్ అయింది. ఒక్కటంటే ఒక్క దానికి వారి దగ్గర సమాధానం లేదు. అన్నీ నిజాలే. వాటిపై మాట్లాడితే ప్రజలు ఎక్కడ నిజాలు తెలుసుకుంటారోనని కంగారు పడి.. పవన్ పై వ్యక్తిగత దాడికి దిగారు.
మొదట ట్విట్టర్లో గుడివాడ అమర్నాథ్ తిట్ల వర్షం ప్రారంభించారు. ఆ తర్వాత అంబటి రాంబాబు .. ఆ తర్వాత కాపు సామాజికవర్గ మంత్రులు ఒకరి తర్వాత ఒకరు తెర ముందుకు వచ్చి అసలు పవన్ సంధించిన ప్రశ్నల మీదకాకుండా అన్నీ మాట్లాడరు. పవన్ ప్రశ్నించేది చంద్రబాబు కోసమేనన్నట్లుగా మాట్లాడారు. ఎవరి కోసమో పవన్ ఎందుకు ప్రశ్నిస్తారు. .. జనసేన పార్టీ కోసం ప్రశ్నిస్తారు.. అయినా చంద్రబాబుకు లింక్ పెడితే చాలు సమాధానం చెప్పాల్సిన పని లేదన్నట్లుగా వైసీపీ నేతల తీరు ఉంది. అందుకే చంద్రబాబు దత్తపుత్రుడు.. ఆయన రాజధానులు రష్యా, పుణె, హైదరాబాద్, విశాఖ అంటూ లేకి మాటలు మాట్లాడుతూ విమర్శలు గుప్పించారు.
అయితే వైసీపీ నేతల తీరుపై సోషల్ మీడియాలోనే కాదు సామాన్య జనంలోనూ చర్చ జరుగుతోంది. ప్రజా సమస్యలు, పాలసీలపై ప్రశ్నిస్తే.. వ్యక్తిగతంగా .. కుటుంబసభ్యుల్ని కూడా బండబూతులు తిట్టి టాపిక్ డైవర్ట్ చేయడం రొటీన్ అయిపోయింది. వైసీపీ దగ్గర విషయం లేదు కాబట్టే..అవన్నీ నిజాలు కాబట్టే సమాధానం చెప్పలేక ఇలా ఎదురుదాడికి దిగుతున్నారన్న అభిప్రాయాలు సామాన్యుల్లో కూడా వస్తున్నాయి. అదే నిజం అని మరోసారి వైసీపీ మంత్రులు నిరూపించారు.