వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే…మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా వేయకుండానే మేనిఫెస్టోను రూపకల్పన చేశారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
టీడీపీ సూపర్ సిక్స్ గ్యారంటీస్ విడుదల చేసిన సమయంలో వైసీపీ పెదవి విరుపులు మొదలు పెట్టింది. టీడీపీ హామీలను నెరవేర్చాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదని, నిధులు ఎక్కడి నుంచి తీసుకోస్తారని ప్రశ్నించిన వైసీపీ తమ మేనిఫెస్టోలో రాష్ట్ర బడ్జెట్ ను పరిగణనలోకి తీసుకోకుండా హామీలు ఇచ్చింది. దీంతో ఇప్పుడు వైసీపీ హామీలను అమలు చేసేందుకు నిధులు ఎక్కడి నుంచి తీసుకోస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
వైఎస్సార్ చేయూత పథకం 75వేల నుంచి లక్షా 50వేలు పెంచనున్నట్లు ప్రకటించారు. అయితే, అత్యధికంగా లబ్ది పొందే అమ్మ ఒడి పథకానికి మాత్రం రెండు వేలు మాత్రమే పెంచడం గమనార్హం. మేనిఫెస్టో అంటే బైబిల్ , ఖురాన్, భగవత్గీతతో సమానమని చెప్పే జగన్ రెడ్డి… మేనిఫెస్టోలో అంకెల గారడీని ప్రదర్శించారు తప్పితే ఆచరణకు సాధ్యమయ్యేలా హామీలను ఇవ్వలేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.