సోము వీర్రాజుకు వ్యతిరేకంగా ఏపీ బీజేపలోని ఓ వర్గం ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేసింది. అయితే సోము వీర్రాజు చాలా మంది నేత బీజేపీని ఉద్దరిస్తాడు అంటూ ప్రో వైసీపీ మీడియా సపోర్ట్ చేయడమే కాకుండా…. ఢిల్లీకి వెళ్లిన నేతల్ని హైకమాండ్ తిట్టి పంపించిందంటూ ప్రచారం చేస్తున్నారు. పైగా వెళ్లిన వాళ్లంతా కన్నా వర్గీయులనే ప్రచారం చేస్తున్నారు. దీంతో సోము వీర్రాజుకు.. వైసీపీ కి మధ్య అసలైన బంధం ఏమిటో తేలిపోతోందని న్యూట్రల్ బీజేపీ నేతలు మండి పడుతున్నారు.
కన్నా లక్ష్మినారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అధికార పార్టీపై గట్టిగా పోరాడేవారు. తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసేవారు. ఆయనపై విజయసాయిరెడ్డి లాంటి వైసీపీ నేతలు ఎదురుదాడి చేసేవారు. బీజేపీ ఎన్నికల ఫండ్స్ వాడేసుకున్నారని విమర్శించేవారు. కారణం ఏదైతేనేం కన్నాకు మరోసారి పొడిగింపు ఇవ్వడానికి బీజేపీ హైకమాండ్ నిరాకరించింది.. సోము వీర్రాజుకు పదవి అప్పగించింది. అయితే అప్పట్నుంచి బీజేపీ స్టాండ్ మారిపోయింది. అధికార పార్టీపై పోరాటం నిలిచిపోయింది. సీఎం జగన్ కూడా కేంద్రంతో.. బీజేపీతో సన్నిహితంగా ఉంటూండటంతో .. అసలు బీజేపీ వైఎస్ఆర్సీపీ అనధికారిక మిత్రపక్షంగా పేరుపడిపోయింది. ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నారు.
జనసేన పార్టీని ఉపయోగించుకుని రాజకీయంగా ఎదిగే అవకాశం ఉన్నా.. కేంద్రంలో అధికార పార్టీ అనే అడ్వాంటేజ్ ఉన్నా.. పూర్తిగా వదిలేసుకుని వైసీపీ పార్టీ కోసం పని చేస్తున్నారన్న ఆరోపణలు లెక్క చేయడం లేదు. మరో వైపు ఈ వర్గాల పోరాటం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఒకరినొకరిపై తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్నారు.