ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యవహారశైలి వైసీపీ నేతల్ని కూడా ఆశ్చర్యపరుస్తోంది. వైసీపీ కోసం గడప గడపకూ వెళ్తే టీడీపీ సైకిల్ గుర్తుకు ఎక్కున ప్రచారం వచ్చేలా చేస్తున్నారు. తాజాగా సాధికార యాత్రలు పెడితే.. రోడ్ల వల్ల బతుకులు బాగుపడతాయా అని ప్రశ్నిస్తన్నారు. ఆయన మాటలు విని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఒకటా రెండా దాదాపుగా అయన చేసే వ్యాఖ్యలు జగన్ రెడ్డి పాలనా విధానాల లోపాలు ఎంత ఘోరంగా ఉంటాయో వెల్లడించేలా ఉన్నాయి.
ల రోడ్లు బాగోలేవని వచ్చే ఎన్నికల్లో వైసీపీని వద్దనుకోవద్దని ఆయన ఓ మీటింగ్ లో ఓటర్లను కోరారు. రోడ్ల వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయా? అని ఆయన ప్రశ్నించారు. ఏ రాష్ట్రం ప్రాంతం అయినా అభివృద్ధి చెందాలంటే రోడ్ల వంటి మౌలిక సదుపాయాలు ముఖ్యం. అందుకే హైదరాబాద్ చుట్టూ ఔటర్ కట్టారు. ప్రతి ఊరు చుట్టూ ఔటర్ కడతామని చెబుతున్నారు. అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఉండాన్ని అభివృద్ధికి చిహ్నంగా చెబుతారు. కానీ.. ధ్రమాన మాత్రం అసలు రోడ్ల వల్ల ఉపయోగమే లేదని చెబుతున్నారు. ఏపీలో గత నాలుగున్నరేళ్ల కాలంలో కొత్తగా రోడ్లు నిర్మించలేదని .. నిర్వహణ చేపట్టకపోవడం వల్ల రోడ్లన్నీ గుంతలు తేలిపోయాయన్న విమర్శలు వస్తున్నాయి.
అయితే ప్రభత్వం మాత్రం రోడ్లు బాగున్నాయని గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఇస్తున్నామని చెబుతోంది. కానీ మంత్రి ధర్మాన మాత్రం రివర్స్ లో చెబుతున్నారు. ఆయన తమ ప్రభత్వ గొప్పల గురించి చెప్పుకోవచ్చు కానీ.. ఇలా ప్రతీ అంశంలో జగన్ రెడ్డి వైఫల్యాన్ని ఎత్తి చూపేలా .. వైరల్ అయ్యేలా వ్యాఖ్యలు చేయడం వెనుక ఏదైనా మర్మం ఉందేమో అన్న గుసగుసలు ఇప్పుడిప్పుడే వినిపిస్తున్నాయి.