దావోస్లో మైనస్ ఐదు డిగ్రీల చలి ఉంటుంది మా ఆరోగ్యాలు ఏం కావాలి ? ఈ చలిలో అక్కడకు వచ్చే పారిశ్రామికవేత్తలు ఎవరూ స్నానాలు చేయరు. మేము వారిలో ఎలా తిరగగలం ? అసలు దావోస్ కు మనం వెళ్లడం ఎందుకు.. మన దగ్గరకే దావోస్ వస్తుంది ? . అసలు ఐటీ పరిశ్రమలు ఎందుకు.. ఇతర రాష్ట్రాలతో పోల్చుకోవడం ఎందుకు… ఎక్కడ చూసినా ఐటీ సంస్థల్లో తెలుగువాళ్లే పని చేస్తున్నారు ? .. ఇలాంటి కామెంట్లు వైసీపీ కోసం సోషల్ మీడియాలో పని చేసే ఓ కార్యకర్త.. తన ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసుకోవడానికి వాదిస్తేనే.. వాడ్ని బుర్రలేని వ్యక్తిగా జమ కడతారు.
అలాంటిది నేరుగా ఐటీ, పరిశ్రమల మంత్రే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఏమనుకోవాలి ? గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీత చర్చకు కారణం అవుతున్నాయి. ఆయన మామూలు వైసీపీ నేత అయితే ఎవరూ పట్టించుకోరు. కానీ పరిశ్రమల మంత్రి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసి పారిశ్రామిక ప్రపంచానికి ఎలాంటి సందేశం పంపుతున్నారు ? ఏపీ గురించి ఎంత చీప్ అభిప్రాయాన్నివిస్తరింప చేస్తున్నారో ఆయనకు అర్థం అవుతుందా ? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
మంత్రి పూర్తి అవగాహనతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అది అహంకారమేనని అనుకోవచ్చు. వ్యక్తిగత అహంకారం ఆయనకు చేటు చేస్తుంది కానీ మంత్రి హోదాలో ఏపీ విషయాల్లో చూపిస్తున్న అహంకారం రాష్ట్రానికి చేటు చేస్తుంది. . ఆయనకు ఏమీ తెలియదని. .. ఆమాయకత్వంతోనే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అనుకుంటే.. అంత కంటే దారుణం మరొకటి ఉండదు. ఇంత నారో మైండేడ్ మనిషి మంత్రిగా ఉన్న రాష్ట్రంపై ఎవరూ జాలి చూపించరు.. పైగా అసహ్యించుకుంటారు.