ధాన్యం మొలకలు వచ్చాయి మంత్రిగారూ.. ఆదుకోండి అని ఓ రైతు కన్నీటితో .. మంత్రి పుంగవులు కారుమూరి నాగేశ్వరరావును అడిగితే.. “నేనేం చేస్తానురా ఎర్రిపప్పా” అని సమాధానాన్ని వైసీపీ పద్దతిలో ఇచ్చి వెళ్లిపోయారు ఆయన. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ బాధ్యత గల మంత్రి.. తన నియోజకవర్గంలో రైతుపై చూపించిన ఈ అభిమానం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఓ వైపు అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా పంట నష్టపోయారు. ప్రభుత్వం అచేతనంగా మారింది. పంట నష్టం గురించి పట్టించుకోవడం లేదు. రైతుల్ని ఆదుకునేందుకు ప్రయత్నించడం లేదు. తడిసిన ధాన్యం గురించీ బాధపడటం లేదు. అసలు రైతుల్నే పట్టించుకోవడం లేదు. ఇలా పట్టించుకోమని వచ్చిన రైతుల్ని ఎర్రిపప్పలని తిడుతున్నారు మంత్రులు.
మంత్రిగారు తిట్టినవారే ఓట్లేసి గెలిపిస్తే.. ఎమ్మెల్యేగా గెలిచి ఆనక మంత్రి పదవి పొంది.. మంత్రి హోదాలో కాన్వాయ్ తో తిరుగుతూ.. అధికారం చెలాయించే కారుమూరి నాగేశ్వరరావుకు.. అసలు తనకు ఆ పదవి ఎలా వచ్చిందో మర్చిపోవడం కన్నా ఎర్రితనం ఏముంటుంది ? మంత్రి పదవి అంటే అనుభవించడానికో.. దందాుల చేయడానికో.. దోపిడీ చేయడానికో అని గట్టిగా నమ్ముకునే మైండ్ సెట్ వచ్చేసిందంటే ఆ ఎర్రితనం ఎవరిది ? మంత్రులు ఉన్నది ప్రజా సమస్యలు వినడానికే.. పరిష్కరించలేకపోతే.. కనీసం భరోసాగా మాట్లాడాలి.. ఎందుకంటే పదవి వారిచ్చినదే. కారుమూరి లాంటి వారికి ఓటేసిన వారు అలా కనిపిస్తే .. అంతకు మించిన సెల్ఫ్ డిక్లరేషన్ ఏముంటుంది?
ఏపీలో రాజకీయ నాయకులుతమకు పదవి అంటే దోచుకోవడానికి ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నారు. తాము దొంగలం అని తెలిసి కూడా ప్రజలు ఓట్లేశారని అంటే.. దోపిడీలు చేసుకోమని చాన్సిచ్చినట్లేనని ఎక్కువ మంది నమ్ముతున్నారు. అందుకే అలాంటి పనులు ఎక్కువగా చేస్తున్నారు కానీ ప్రజా సమస్యల గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్ని విపత్తులు వచ్చినా సీఎం జగన్ అసలు బయటకు రారు.. పట్టించుకోరు… బయటకు వచ్చే మంత్రులు ఇలా నోరు చేసుకుంటారు. ఇక ఏపీ రైతుల్ని ఎవరు కాపాడతారు ?