ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని హైదరాబాద్‌లో మోహన్‌బాబుతో సమావేశం అయ్యారు. టిక్కెట్ రేట్లను ఖరారు చేసే ముందు మోహన్ బాబు అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నారు. టిక్కెట్ రేట్లపై ఎవరు ఎలాంటి అభిప్రాయాలు చెప్పాలనుకున్నా తనను కలవొచ్చని పేర్ని నాని చెబుతూంటారు. రామ్‌గోపాల్ వర్మకు అపాయింట్మెంట్ ఇచ్చి తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. అలాగే రెండు రోజుల కిందట మాట్లాడిన తమ్మారెడ్డి భరద్వాజను కూడా ఆయన అభిప్రాయాలు ఏమైనా ఉంటే నేరుగా తనకు తెలియచేయవచ్చన్నారు.
కానీ పేర్ని నాని మోహన్ బాబు వద్దకు ప్రత్యేకంగా వచ్చి సినిమా టిక్కెట్ రేట్లపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. గురువారం రోజు చిరంజీవి బృందంతో పాటు తమ పార్టీకి సన్నిహితులయిన అలీ, పోసాని, నారాయణమూర్తిలను కూడా పిలిచారు కానీ తనను పిలవకపోవడం ఏమిటని మోహన్ బాబు అసంతృప్తికి గురయినట్లుగా ప్రచారం జరిగింది. అదే సమయంలో అలీకి రాజ్యసభ సీటు అంటూ జరిగిన ప్రచారం కూడా ఆయనకు మరింత ఆగ్రహం తెప్పించిందంటున్నారు. వైసీపీ పార్టీలో చేరక ముందు నుంచే ఆ పార్టీకి ఎంతో మేలు చేసినా తనకు ఇంత వరకూ ఎలాంటి పదవి ఇవ్వలేదన్న అసంతృప్తి మోహన్ బాబులో ఉంది. టీటీడీ చైర్మన్ పదవిని ఆయన ఆశించారు. కానీ ఇవ్వలేదు.
ఇప్పుడు అలీకి రాజ్యసభకు ఇస్తే తనను అవమానించినట్లేనని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. మోహన్ బాబుకు ఇటీవల ప్రభుత్వం యూనివర్శిటీకి అనుమతులు ఇచ్చింది.ఈ కారణంగానే ఆయన కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉంటున్నారు అయితే తనను పక్కన పెట్టి అవమానిస్తున్నారన్న భావనకు ఆయన రావడంతో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా పేర్ని నాని పంపి కూల్ చేసినట్లుగా తెలుస్తోంద