వారాహి యాత్రలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలు మంత్రులకు నిద్రపట్టనీయడం లేనట్లుగా ఉంది. ఆయన అలా మాట్లాడటం ఆలస్యం.. ఇలా తర్వాతి రోజు మంత్రులు ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకు వస్తున్నారు. పవన్ కల్యాణ్ ను తమదైన లాంగ్వేజ్ లో విమర్శలు తిడుతున్నారు. అయితే వారి విమర్శల్లో ఈ సారి గాజు గ్లాస్ గుర్తు ప్రధానంగా వచ్చింది. పవన్ కల్యాణ్.. తన చెప్పులు పోయాయని.. పేర్ని నానిపై సెటైరిక్ గా అనడం వారికి సూటిగా గుచ్చుకున్నట్లుగా ఉంది. వెంటనే.. చెప్పులు కాదు.. గాజు గ్లాస్ గుర్తు పోయింది చూసుకో అంటూ.. పేర్ని నాని, సీదిరి అప్పలరాజు, దాడిశెట్టి రాజా వంటి వారు మీడియా ముందుకు వచ్చేశారు.
గాజ్ గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్స్ కేటగిరిలో ఈసీ చేర్చింది. అయితే జనసేన పోటీ చేసే చోట్ల.. ఆ పార్టీకి కంబైన్డ్ గా అదే గుర్తు కేటాయించడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందులో సందేహం లేదు. గత ఎన్నికల్లోనూ అదే గుర్తుతో పోటీ చేసినందున విజ్ఞప్తి చేస్తే కేటాయిస్తారు. జనసేన పోటీ లో లేని చోట్ల ఇండిపెండెంట్లకు కేటాయిస్తారు. అదే సమయంలో జనసేన పార్టీ అభ్యంతరం చెబితే.. కేటాయించకుండా పక్కన పెడితే.. ఎలా చూసినా జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు దూరం కాదు. కానీ.. వైసీపీ నేతలకు విమర్శించడానికి ఇదే కనిపిచింది. అదే మాట్లాడుతున్నారు.
జనసేన గుర్తుపై అసలు ఎక్కువగా బాధపడుతోంది.. వైసీపీ మంత్రులేనని.. జనసేన క్యాడర్ సెటైర్లు వేస్తున్నారు. పవన్ కల్యాణ్ నే జనసేనకు గుర్తు అని.. ఎన్నికల గుర్తు ఏదైతే ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే పవన్ ను విమర్శించకపోతే.. పైన జగన్ ను మెప్పించలేమని.. కింది స్థాయి నేతల ఆందోళన. అందుకే.. లాజిక్ లేకుండా. విమర్శలు గుప్పించడానికే ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు.