నెల్లూరు జిల్లా కావలి వైకాపా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈనెల 18న తెదేపాలో చేరబోతున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తూ మైండ్ గేమ్ ఆడుతోందని ఆయన అన్నారు. తను తెదేపా ప్రలోభాలకు లొంగిపోయే వాడిని కానని, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జగనన్న వెంటే ఉంటానని ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పారు. తన గురించి ఇటువంటి వార్తలు వ్రాసేముందు మీడియా ప్రతినిధులు తన వివరణ కోరి ఉండి ఉంటే బాగుండేదని అన్నారు. ఆయన చెపుతున్న ఈ మాటలు నిజమో లేక పార్టీ మారుతారని మీడియా చెపుతున్న మాటలు నిజమో ఈ నెల 18న ఎలాగూ తేలిపోతాయి కనుక అంతవరకు వేచి చూడక తప్పదు. ఒకవేళ ఆరోజు ఆయన తెదేపాలో చేరకపోతే, ఆయన చెపుతున్నట్లు ఇది ఎల్లో మీడియా దుష్ప్రచారంగానే భావించవచ్చు. చేరితే అప్పుడు ఆయనే డానికి సంజాయిషీ చెప్పుకోక తప్పదు.