దళిత ఎమ్మెల్యే నోరు విప్పారు. తనకు అన్యాయం జరిగిందని.. తన నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. పార్టీలో వ్యవహారంపై మండిపడ్డారు. అంతే.. ఆమెకు పెత్తందారులు చుక్కలు చూపించడం ప్రారంభించారు. ఎలా ఉందంటే రెండు అంటే రెండు రోజుల్లో ఆమె వీడియోలు రిలీజ్ చేయడం.. ప్రెస్ మీట్లు పెట్టడం.. జగన్ రెడ్డిని ఆహో.. ఓహో అని పొగడటం..తన మాటలు వక్రీకరించారని దబాయించడం కామన్గామారిపోయింది. తాజాగా ఆమెను అమరావతికి పిలిపించి.. పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టించారు.
అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. రెండు రోజుల కిందట ప్రభుత్వ తీరును తప్పుబడుతూ ఫేస్బుక్ లైవ్ ఇచ్చింది. తనకు సింగనమల సీటు నిరాకరించడంతో ఎమ్మెల్యే పద్మావతి సీఎంవో పై విమర్శలు చేసింది. ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపణలు చేసింది. తమ కాలువల నుంచి తాము తాగునీటి విడుదల కోసం.. సీఎంవో నుంచి అనుమతి తీసుకోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఇది వైరల్ అయిపోయింది. దీంతో.. పద్మావతి వ్యవహార శైలిపై హైకమాండ్ సీరియస్ అయింది.
ఆమేను తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయాని పిలిపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆమెకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి.. పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టింది. జొన్నలగడ్డ పద్మావతి.. ఎస్సీ సర్టిఫికెట్ తో .. ఎమ్మెల్యే అయినా.. ఆమె భర్త మాత్రం ఆలూరు సాంబశివారెడ్డి. మొత్తం ఆయనే నియోజకవర్గంలో పెత్తనం చేస్తారు.