జనసేన అదినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం భ”జనసేన”ను ఏర్పాటు చేసినట్లుగా ఉందని ఆమె ఎద్దేవ చేశారు.
పవన్‌ది జనసేన కాదు…భజన సేన. చంద్రబాబుది తల్లి టీడీపీ అయితే…పవన్‌ది పిల్ల టీడీపీ. అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రి అవకూడదని పవన్ అంటున్నారు. మరి పిల్లనిచ్చిన మామపై చెప్పులు విసిరి, వెన్నుపోటు పొడిచి సీఎం కావచ్చా? ఏ అర్హత లేకపోయినా ఎమ్మెల్యేగా గెలవని వ్యక్తిని ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వొచ్చా?. అలాంటి వారికి పవన్ కల్యాణ్ భజన చేస్తారా?.అని రోజా ద్వజమెత్తారు. అలాగే పవన్ వారసత్వ రాజకీయాలు చేయొద్దని చేసిన కామెంట్లపై – చిరంజీవి లేకపోతే పవన్ లేడని అంటూ , వారసత్వ రాజకీయాలపై మానేసి వారసత్వ సిమిమాలపై మాట్లాడమని హితవు పలికారు.
అయితే ఆవిడ మాటలు చూస్తే ఎప్పటిలాగే రోజా మళీ లాజిక్ వదిలేసి విమర్శలు చేసినట్టు అనిపిస్తోంది . పోలవరం ఎట్టి పరిస్థితుల్లో 2019 లోపు అవదని అంటూ చంద్రబాబు ని కూడా ఇరుకునపెడుతున్న పవన్ జనసేన ని పిల్ల టీడీపి గా విమర్శిండం లో లాజిక్ కనిపించడం లేదు. అలాగే పవన్ వల్లే చిరంజీవి నష్టపోయాడని ఇప్పుడు ఆమె చిరంజీవి మీద అభిమానం ఒలకబోయడం లో కూడా ఔచిత్యం కనిపించడం లేదు. చిరంజీవి పార్టీ పెట్టినపుడు చిరంజీవి ని ఒక రేంజ్ లో ఆడుకున్న నాయకులలో ఆవిడ ముందు వరసలో ఉంటారు మరి!!