ప్రాంతీయ పార్టీల నేతలు అవకాశం వస్తే ప్రధాని పదవి అందుకోవాలని చాలా పట్టుదలగా ఉన్నారు. కేసీఆర్ నుంచి మమతా బెనర్జీ వరకూ ఇలాంటి నేతలు బహిరంగంగానే తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రేసులో ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యేలు అన్యాపదేశంగా చెబుతున్నారు. ఏపీ సీఎం జగన్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచారని… అందుకే ఈ దేశానికి జగన్ ప్రధాని అవుతారని కోవూరు ఎమ్మెల్యే్ నల్లపురెడ్డి పసన్నకుమార్ రెడ్డి ప్రకటించారు.
మంత్రి పదవి ఇవ్వలేదని అసంతృప్తిగా ఉన్నారని గతంలో ప్రసన్నకుమార్ రెడ్డిపై ప్రచారం జరిగింది. గడప గడపలోనూ చాలా కాలం పాల్గొనలేదు. జగన్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆయన పాల్గొంటున్నారు. అందుకే జగన్ పై సెటైర్ వేశారా లేకపోేత ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారా అన్నది కోవూరులో చర్చనీయాంశం అయింది. జగన్ అభ్యర్థులను మార్చనున్న నియోజకవర్గాల్లో కోవూరు కూడా ఉందని ఈ సారి నల్లపురెడ్డి కుటుంబానికి జగన్ హ్యాండివ్వబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
అదే జరిగితే మొదటికే మోసం వస్తుందని.. ఇతర పార్టీల్లోకి రానిచ్చే పరిస్థితి లేదని ఆయన ఆందోళన చెందుతున్నారు. అందుకే జగన్ ను పొగిడేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. కానీ ఆయన పొగడ్తలు సెటైర్లులాగా ఉండటంతో వైసీపీ నేతలు కూడా నవ్వుకుంటున్నారు. జగన్‌కూ అలాగే అనిపిస్తే పసన్నకు మరిన్ని కష్టాలు తప్పవేమోనని కోవూరు నేతలు గుసగుసలాడుకుంటున్నారు.