ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప చెళ్లు్మనిపించాడు ఓటర్. దానికి కారణం ఎమ్మెల్యే చేసిన దాడే. గత ఐదేళ్లుగా సాగించిన పెత్తందారి పోకలను ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ లోకి వెళ్లే సమయంలో చూపించడంతో ఎదురు చెంపదెప్ప తినాల్సి వచ్చింది.
పోలింగ్ బూత్ లోకి నేరుగా తాను మాత్రమే కాకుండా మరో నలుగుర్ని వెంటేసుకుని వెళ్లబోయారు శివకుమార్. అప్పటికే చాలా పెద్ద క్యూల్లో ఉన్న ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి అలా ఎలా వెళ్తారని ప్రశ్నించారు. దీంతో శివకుమార్ వెంటనే ఆ ఓటర్ పై దాడి చేశారు. ఆ ఓటర్ తిరిగి లాగిచ్చి శివకుమార్ ను కొట్టాడు. ఆ తర్వాత శివకుమార్ అనుచరులు అతనిపై దాడి చేశారు. ఈ వ్యవహారంపై ఈసీ స్పందించింది. శివకుమార్ ను గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది.
ఈ ఘటన ముందు.. తర్వాత ఏం జరిగిందన్న సంగతిని పక్కన పెడితే .. ఎమ్మెల్యేను లాగిచ్చి ఓటర్ కొట్టిన వ్యవహారం మాత్రం .. వైసీపీకి తగిలిన దెబ్బగానే చూడొచ్చు. సింబాలిక్ గా ఉన్న వ్యవహారం ఒక్క సారిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైసీపీ అహంకారానికి ఓటర్లు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వబోతున్నారో తెలిసేలా ఆ ఘటన ఉంది.