తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు ఆ పార్టీ నేతలకు కూడా ఎక్కడ లేని ధైర్యాన్ని ఇస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ నేతలకు… అయితే… ఆ సంబంధాలు… ఓ పెద్ద రక్షణ కవచంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఏం చేసినా… పోలీసులు, అధికారులు అడ్డుకోకుండా.. టీఆర్ఎస్ నేతల కంటే.. ఎక్కువగా.,. అధికార జులుం ప్రదర్శిస్తున్నారు. “కేసీఆర్‌కు చెప్పి సస్పెండ్ చేయిస్తా” అని నేరుగా హెచ్చరికలు జారీ చేసేస్తున్నారు. వీడియోలు తీస్తున్నా.. వారు అసలు వెనక్కి తగ్గడం లేదు. కేసీఆర్ అంటే… తమ పార్టీ అధ్యక్షుడేనని.. తమకు అండగా ఉంటారని.. ఆయనకు ఒక్క మాట చెబితే.. తెలంగాణ అధికారుల్నే బదిలీ చేస్తారని… గట్టిగా నమ్ముతున్నారు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుటుంబానికి.. ఈ ధైర్యం మరింత ఎక్కువగా ఉంది. ఆయన కొడుకు, భార్య ఇలా.. హైదరాబాద్‌లో పోలీసులను బెదిరిస్తూ.. మీడియాకు దొరికిపోయారు. రెండు రోజుల కిందట.. వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుమారుడు ప్రసాద్… ట్రాఫిక్ సీఐను.. కాలితో తన్నారు. ఈ కేసులో.. పోలీసులు.. ఉదయభానును అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు అరెస్ట్ చూపించారు. ప్రసాద్‌పై ఐపీసీ 323, 353 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడంపై.. సామినేని ఉదయభాను భార్య, ప్రసాద్ తల్లి… మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి వీరంగమాడారు. కుటుంబ సభ్యులంతా పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోలీసులపై ఆగ్రహం వ్యక్త చేశారు. రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు.
కేసీఆర్‌తో చెప్పి సస్పెండ్ చేయిస్తానంటూ.. ట్రాఫిక్ పోలీసులకు కుటుంబ సభ్యులు వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది. ఓ ఆంధ్రా ఎమ్మెల్యే కుమారుడు.. తెలంగాణ పోలీసులను కాలితో తన్నడమే కాదు.. కేసులు పెట్టినందుకు.. తెలంగాణ పోలీసుల్ని..కేసీఆర్ పేరుతో బెదిరించేందుకు కూడా వెనుకాడలేదు. వైసీపీ – టీఆర్ఎస్ అధినేతల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలే.. వైసీపీ ఎమ్మెల్యే కుటుంబసభ్యులు ఇలా చెలరేగిపోవడానికి కారణమని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదేమో..?