వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. వారంతా రాజీనామా చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మీడియా ముందు మాట్లాడటానికి ఎమ్మెల్యే పదవులు అక్కర్లేదు కాబట్టి రాజీనామాలు చేయాలని అంటున్నారు. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు అంత ధైర్యం చేసే అవకాశం లేదు. అయితే వారిపై అనర్హతా వేటు పడటానికి మాత్రం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వరుసగా మూడు సెషన్లకు ఎవరైనా సభ్యుడు గైర్హాజర్ అయితే.. అనర్హతా వేటు వేయవచ్చు. అనర్హతా వేటు పడకుండా ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలు తాము చేసుకోవచ్చు. ఎలా అంటే.. ఆరోగ్యం బాగోలేక రాలేకపోతున్నామని లేదా ఇతర కారణాలు చెబుతూ స్పీకర్‌కు లేఖ రాసుకోవచ్చు. స్పీకర్ లవ్ లెటర్‌ను ఆమోదిస్తే అనర్హతా వేటుకు అవకాశం ఉండదు.
గతంలో కూడా వైసీపీ తన ఎమ్మెల్యేలందరితో బాయ్ కాట్ చేయించింది. జగన్ రెడ్డి పాదయాత్ర చేస్తూంటే.. ఆయన ఎమ్మెల్యేలు ఫిరాయింపుల కారణం చెప్పి డుమ్మాకొట్టారు. వారిపై మూడు సెషన్ల తర్వాత అనర్హతా వేటు వేయవచ్చని అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా ప్రకటించారు. కానీ మూడు సెషన్ల తర్వాత ఎన్నికలు వచ్చేశాయి. అందుకే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాన ఇప్పుడు ఇదే మొదలు కాబట్టి.. మూడు సెషన్ల తర్వాత అంటే.. మరో ఏడాది తర్వాత వారిపై అనర్హతా వేటు వేయవచ్చు.
ఇప్పటి వరకూ అసెంబ్లీకి హాజరు కాకపోవడం వల్ల ఎవరిపైనా అనర్హతా వేటు పడలేదు. ఎందుకంటే.. ఎన్నికైనా ప్రతి సభ్యుడికి తన విధి ఏమిటో తెలుసు. ఒక్క వైసీపీ ఎమ్మెల్యేలే చరిత్ర సృష్టించబోతున్నారు.