వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ మూడో పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్య చనిపోయింది. మొది భార్య ద్వారా ఓ కుమార్తె ఉన్నారు. రెండో పెళ్లి ద్వారా ఓ కుమార్తె , కుమారుడు ఉన్నారు. రెండో భార్య తో విడాకులు తీసుకోలేదు. కానీ మూడో పెళ్లి చేసుకున్నారు. ఇది చట్ట వ్యతిరేకం అవుతుంది. అయితే రెండో భార్య ఇష్ట పూర్వకంగానే పెళ్లి చేసుకుంటున్నట్లుగా ఆమెతో సాక్షి సంతకం చెయించారు. కైకలూరు రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగిన ఈ పెళ్లి రిజిస్ట్రేషన్ కు .. రెండో భార్యతో పాటు కొడుకు కూడా వచ్చాడు.
మూడో పెళ్లి చేసుకున్న సుజాత అనే మహిళ ఓ ప్రభుత్వ ఉద్యోగిని. ఆమెతో ఎక్కడ పరిచయం అయిందో కానీ.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ఆమెకూ రెండో పెళ్లినే. ఓ అబ్బాయి కూడా ఉన్నారు. రెండో భార్య అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నందున ఎలాంటి వివాదం ఉండదని ఎమ్మెల్సీ వర్గీయులు చెబుతున్నారు. కుటుంబంలో ఎలాంటి గొడవలు రాకుండా రెండో భార్యను ఒప్పించి ఎమ్మెల్సీ మూడో పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. జయ మంగళ వెంకట రమణ ఇటీవలి కాలం వరకూ టీడీపీలోనే ఉన్నారు. 2005లో కైకలూరు జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున కైకలూరు నియోజకవర్గం గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో పొత్తుల్లో భాగంగా టికెట్ ఇవ్వలేదు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.
తర్వాత ఆరోగ్యం సహకరించకపోవడంతో ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడం లేదు. ఇటీవల ఆయనకు వైసీపీలో ఎమ్మెల్సీ ఆఫర్ రావడంతో ఆ పార్టీలో చేరిపోయారు. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికల్లో ఆయన నిలబడి.. ఉత్కంఠ పోరులో రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలిచారు.