అవడానికి పోలీసే కానీ రాజకీయాల్లో మాత్రం ఆయనకు మించిన కమెడియన్ మరొకరు ఉండరని తరచూ నిరూపిస్తూ ఉంటారు. ప్రతీ సారి అంతే. తాజాగా పార్లమెంట్ లో దుండగులు కలర్ స్మోక్ లు ప్రయోగించిన ఘటనలోనూ ఆయన బిల్డప్‌కు అందరూ నవ్వుకుంటున్నారు. ప్రశ్నోత్తరాలు జరుగతుున్న సమయంలో ఓ దండగుడు గ్యాలరీ నుంచి దూకాడని ..స్మోక్ బాంబులు వదులుతున్న సమయంలో తాను వెంటపడి.. అతన్ని పట్టుకుని పెడరెక్కలు విరిచి కట్టేసి.. భద్రతా సిబ్బందికి అప్పగించానని గోరంట్ల మాధవ్ మీడియాకు చెప్పారు.
వైసీపీ నేతలు ఇలాంటి సాహసాలు చేశారని చెబితే.. రోమాలు నిక్కబొడిచుకుని బ్రేకింగ్‌లు వేసే కూలీ మీడియా రెడీ అయింది. బ్రేకింగ్‌లు వేసి ఫోన్ ఇన్ లు తీసుకున్నారు. అందులో మాధవ్ తనకు తాను వేసుకున్న ఎలివేషన్లు చూసి నిజంగానే అంత జరిగిందా అనుకున్నారు . కానీ కాసేపటికి దృశ్యాలు బయటకు వచ్చాయి. గోరంట్ల మాధవ్ నిర్వాకం చూసి.. ఆయన చేసింది ఇదా అని ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. దుండగుడు సాగర్ శర్మన కాంగ్రెస్ ఎంపీలు పట్టుకుని కొడుతున్న సమయంలో ఎక్కడో నాలుగు బెంచీలు అవతల ఉన్న గోరంట్ల మాధవ్.. తన పోలీస్ చేతికి జిల పుట్టిందేమో తాను కూడా ఓ దెబ్బ వేయాలని.. బెంచీలు దూకి మరీ వచ్చారు.
అందరూ పట్టుకుని కొడుతూంటే తాను ఓ దెబ్బ వేసి.. హీరోలా ఫీలయ్యాడు. ఆ దృశ్యాలన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. అసలు బయట గోరంట్ల మాధవ్ చేసుకున్న ప్రచారం ఏంటి.. లోపల జరిగిదేమిటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో కామెడీ చేస్తున్నారు. అయినా మాధవ్ మాత్రం… కాలర్ ఎగరేసుకుంటున్నారు.