హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అనంతపురంలో తాను అద్దెకు తీసుకున్న ఇంటికి కిరాయి కట్టడం లేదు. కనీసం కరెంట్ బిల్లు కట్టడం లేదు. కట్టాలని అడిగిన ఇంటి ఓనర్‌ను లారీతో గుద్దించి చంపేస్తానని హెచ్చరించారు. మామూలుగా అయితే ఇది పెద్ద కేసు. కానీ అనంతపురం పోలీసులు మాత్రం ఇంటి ఓనర్ని..అనంతపురం ఎంపీని కూర్చోబెట్టి పరిష్కారం చేయాలని చూస్తున్నారు. ఇంటి ఓనర్ ఫిర్యాదును తీసుకుని కేసు నమోదు చేయకుండా.. ఎంపీను పిలిపించి మాట్లాడుతున్నారు. దీంతో పోలీసుల తీరును చూసి ఇదేమి చోద్యం అనుకోవడం ప్రజల వంతయింది.
ఆ ఇంటి ఓనర్ పేరు మల్లికార్జున రెడ్డి . వైసీపీ మద్దతుదారుడే .అందుకే ..మంచి కాస్ట్లీ ఏరియాలో అయిన రామ్ నగర్లో తక్కువకే అద్దెకు ఇచ్చారు. కానీ ఆ తక్కువను కూడా ఎంపీని కాబట్టి ఎగ్గొట్టాలనుకుంటున్నాడు గోరంట్ల మాధవ్. ఇంటి యజమాని మొదట కుటుంబసభ్యులతో ఎంపీ ఉంటున్న ఇంటి ఎదుట ధర్నా చేయాలని భావించారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ , సీఐ, సిబ్బంది మల్లికార్జునరెడ్డితో రాజీ చర్చలకు ఒప్పించారు.
పెద్దమనుషుల సమక్షంలో ఇంటి యజమాని, ఎంపీ మాధవ్‌తో ఓ గదిలోకి చర్చలు జరిపారు. అక్కడ కూడా సమస్య కొలిక్కిరాకపోవడంతో మరోసారి మాట్లాడాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఎంపీ ఇంటి అద్దె బకాయిలు చెల్లించి ఇళ్లు ఖాళీ చేయాలని యజమాని డిమాండ్ చేస్తున్నారు. అద్దె చెల్లించేసి ఇక తన ఇంటిని ఖాళీ చేయాల్సిందేనని మల్లికార్జునరెడ్డి చెబుతున్నారు. ఇంటి అద్దె ఇస్తాననని గోరంట్లమాధవ్ చెబుతున్నారు.. కానీ.. ఇప్పుడిస్తా అనట్లే్దు. అంతే కాదు ఇంటిని ఖాళీ చేయనంటున్నారు.
గోరంట్ల మాధవ్ వ్యవహారశైలి గురించి తెలిసిన వారు.. ఆయన చిల్లర పంచాయతీల గురించి బయటకు వచ్చేవి ఒకటి రెండేననని..పోలీసులు అంతర్గతంగా చేస్తున్న సర్దుబాట్లు చాలా ఉన్నాయని అంటున్నారు. మల్లికార్జునరెడ్డికి వైసీపీలోని తన సామాజికవర్గం నేతల సపోర్ట్ ఉండటంతో ధైర్యంగా ముందుకొొచ్చారని అంటున్నారు.