రఘురామకృష్ణంరాజు పూర్తిగా బీజేపీ సైడ్ మాట్లాడటం ప్రారంభించారు. బడ్దెట్పై ఓ వైపు విజయసాయిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సమయంలోనే… రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ.. పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ అద్భుతంగా ఉందన్నారు. వ్యవసాయం, తాగునీటికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం సంతోషమన్నారు. ఆక్వా రంగానికి బడ్జెట్లో పెద్ద పీట వేశారన్నారు. మరి ఏపీకి ఎలాంటి నిధులు కేటాయించలేదన్న ప్రశ్నకు.. క్రియాశీలకంగా వ్యవహరించి రాష్ట్రానికి అధిక నిధులు తెచ్చుకుంటామమని ప్రకటించారు.
బడ్జెట్ కేటాయింపుల్లోనే లేనివి తర్వాత ఎలా తీసుకు వస్తారో రఘురామకృష్ణంరాజు చెప్పలేదు కానీ… ఆయన పూర్తిగా బీజేపీ స్టాండ్‌ను.. వైసీపీ ఎంపీగా వినిపిస్తున్నారన్న విషయం మాత్రం.. అందరికీ క్లారిటీ వచ్చేసింది. వప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. భర్తీ చేయాల్సిన లోటు కనీసం రూ.18వేల కోట్లు ఉందని … వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు పెండింగ్ లో ఉన్నాయని.. ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం చెవికెక్కించుకోలేదు. ఈ విషయం రఘురామకృష్ణంరాజు తనకు సంబంధం లేదన్నట్లుగా ఉన్నారు.
వైసీపీ నాయకత్వం తీరు.. రఘురామకృష్ణంరాజు కొద్ది రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. పలుమార్లు బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారు. ఈ వారం.. ఓ మంత్రిపై ఫైరయ్యారు. తనను అవమానించారని.. జగన్ కు నేరుగా లేఖలు రాశారు. గతంలో జగన్ ఓ సారి.. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడటంతో.. తాడేపల్లి ఇంటికి పిలిపించి.. హెచ్చరించి పంపారు. ఆ తర్వాత కూడా రఘురామకృష్ణంరాజు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.