జగన్ రెడ్డి తాను ద్వేషించే సామాజికవర్గానికి చెందిన కేశినేని నానిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రతినిధుల్ని పంపి..టిక్కెట్ల ఆఫర్లు ఇచ్చారు. కానీ ఆయన అలా కంగారుపడుతున్న సమయంలోనే పార్టీకి సొంత ఎంపీ గుడ్ పైచెప్పారు. ఆయనే కర్నూలు సంజీవ్ కుమార్. ఆయన గుడ్ బై చెప్పే ముందు తనకు జరిగిన అవమానాల గురించి చెప్పుకుని ఏడ్చినంత పనిచేశారు. విజయవాడలోని ఓ హోటల్లో ఆయన ఐదు రోజులుగా మకాం వేశారు. ప్రతీ రోజూ.. తాడేపల్లి ఆఫీసులో ఉండే వాళ్లకు ఫోన్ చేయడం.. తాను వచ్చి కలుస్తానంటే తర్వాత చెబుతామని చెప్పడం కామన్ అయ్యాయి.
నాలుగురోజుల పాటు అలాగే ఎదురు చూసి ఆయన చివరికి ఇక పార్టీలో తనకు గౌరవం లేదనుకున్నారు. చివరికి విజయసాయిరెడ్డిని కలుద్దామనుకున్నా కుదర్లేదు. ఓ ఎంపీగా ఉండి.. తనకు ఈ దుస్థితేమిటని ఆయన పీలయ్యారు. ఎంపీగా గెలిచిన తర్వాత రెండు అంటే రెండు సార్లు మాత్రమే జగన్ రెడ్డిని కలిశారని.. అప్పుడు కూడా ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా చేయాలన్నారు కానీ తన మాట వినలేదన్నారు. బీసీలు పెద్దపీట అని జగన్ రెడ్డి చెబుాతరు కానీ వైసీపీ రెడ్డి వర్గానికి మాత్రమే ప్రాధాన్యత లభిస్తుందన్నారు.
డాక్టర్ పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న తనను ఘోరంగా అవమానిస్తున్నారని ఆయన ఫీల్ అయ్యారు. తనకు టిక్కెట్ ఉందో లేదో కూడా చెప్పడం లేదని.. బీసీలంటే చులకన అని మండిపడ్డారు. కుటుంబసభ్యులందరితో చర్చించి.. రాజీనామా నిర్ణయం తీసుకున్నానని.. ఏ పార్టీలో చేరేది తర్వాత చెబుతానన్నారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు.