సీఎం జగన్‌తో నేరుగా మాట్లాడటానికే కొంత మంది జంకుతారని వైసీపీలో చెప్పుకుంటారు. కానీ చిలుకలూరిపేటలో మాత్రం ఆయన ఎంపీ నుంచి కాస్త చేదు అనుభవమే ఎదురైంది. ఎంపీ కృష్ణదేవరాయులు సీఎం జగన్‌తోనే సీరియస్‌గా మాట్లాడారు. కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వడం లేదని… లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. దీంతో సీఎం జగన్ ఉలిక్కి పడి.. రా కృష్ణా అంటూ.. ఆయనను వేదికపైకి తీసుకెళ్లారు. ఈ ఘటన చిలుకలూరిపేట సభలో హైలెట్ అయింది.
విడదల రజనీ.. ఎంపీ కృష్ణదేవరాయులు మధ్య కొంత కాలంగా వర్గపోరాటం నడుస్తోంది. నర్సరావుపేట నియోజకవర్గంలో ఇతర ఎమ్మెల్యేలు కూడా ఎంపీని పట్టించుకోవడం లేదు దీంతో ఆయనకు అధికారిక కార్యక్రమాలకూ ఆహ్వానం ఉండటం లేదు. అందుకే చాలా కాలంగా ఆయన బయట కనిపించడం లేదు.. ఈ కారణంగానే ఆయన పార్టీకి దూరమయ్యారని.. ఇతర పార్టీల నేతలతో టచ్‌లో ఉన్నారని కూడా చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి సభకు కూడా ఆయనకు తూ. తూ మంత్రంగా ఆహ్వానం వచ్చింది. స్టేజ్ పైన ఉండేవారి జాబితాలో ఆయన పేరు లేదు.
అందుకే సీఎం జగన్ స్టేజి కిందనుంచి పైకి వెళ్తున్న సమయంలో పలకరించడంతో ఒక్క సారిగా ఫైర్ అయ్యారు. ఇదిపెద్దలవుతుందేమో అనిజగన్ కంగారు పడి ఆయనను స్టేజ్ మీదకు తీసుకెళ్లారు. నిజానికి సీఎం జగన్ తో పాటు సజ్జల దృష్టికి … ఎంపీ లావు తన సమస్యను తీసుకెళ్లారు. కానీ ఈ వివాదంలో మంత్రి విడదల రజనీ మాటలకే ఎక్కువే ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే కృష్ణదేవరాయులు… చాన్స్ దొరకగానే బరస్ట్ అయ్యారు. అది వీడియోలో రికార్డయింది.