దుగ్గిరాల ఎంపీపీగా వైసీపీ ఎంపీటీసీ రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దుగ్గిరాల ఎంపీపీ బీసీలకు రిజర్వ్ అయింది. టీడీపీ, జనసేన తరపున ఉన్న ఒకే ఒక్క బీసీ ఎంపీటీసీకి .. కుల ధృవీకరణ పత్రం ఇవ్వలేదు. కింది స్థాయి అధికారులు ఆమె బీసీ కాదనిఇచ్చిన నివేదికనే కలెక్టర్ కూడా సమర్థించడంతో షేక్ జబీన్ అనే ఆ ముస్లిం ఎంపీటీసీ ఎంపీపీ కాలేకపోయారు. రూపవాణికి బీసీ సర్టిఫికెట్ ఇవ్వడంతో ఆమె ఒక్కరే ఎంపీపీ పదవికి నామినేషన్ వేశారు.దీంతో ఆమె ఎన్నికను ఏకగ్రీవం చేస్తున్నట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. మొత్తం 18 మంది ఎంపీటీసీల్లో తొమ్మిది మంది టీడీపీ, ఒకరు జనసేనకు చెందినవారు.
మిగిలిన ఎనిమిది మంది వైసీపీకి చెందినవారు. అయితే టీడీపీ, జనసేన నుంచి పది మంది ఎంపీటీసీలు హాజరైనా.. వైసీపీ నుంచి మాత్రం ఐదుగురే హాజరయ్యారు. రూపవాణికి ఎంపీపీ పదవి ఇస్తే ఇండిపెండెంట్గా నిలబడతారన్న అనుమానంతో ఇతర బీసీ ఎంపీటీసీల్ని ఎన్నికకు రానివ్వలేదు. టీడీపీతో ఒప్పందం చేసుకున్నారని ప్రచారం జరిగిన పద్మావతి అనే ఎంపీటీసీని ఎమ్మెల్యే ఆర్కే కిడ్నాప్ చేశారని ఆమెకుమారుడు రచ్చ రచ్చ చేశారు.
ఆర్కే ఎంపీపీ ఎన్నికకు కూడా ఆమెను తీసుకు రాలేదు. పద్మావతితో పాటు మరో ఇద్దర్ని అదే విధంగా నిర్బంధంలో ఉంచి… మిగిలిన ఐదుగురితో ఎన్నికకు వచ్చినట్లుాగ తెలు్స్తోంది. టీడీపీ ఎంపీపీ అభ్యర్థికి కుల ధృవీకరణ పత్రం ఇవ్వకపోవడంతో ఆ కూటమి తరపున ఎవరికీ ఎంపీపీ స్థానం దక్కదనితేలిపోయింది. అయితే వైస్ ఎంపీపీలురెండు, కో ఆప్షన్ సభ్యుడి పదవులు అన్నీ టీడీపీ, జనసేన కూటమికే దక్కాయి.