సచివాలయ ఉద్యోగ పరీక్షల నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. జనరల్ కేటగిరీలో ర్యాంకర్లు అత్యధికం ఒకే సామాజికవర్గం వారని ప్రచారం జరగడంతో పాటు.. ర్యాంకర్లు.. వారి బ్యాక్ గ్రౌండ్.. అనుమానితంగా కనిపిస్తున్నాయి. సివిల్స్ స్థాయిలో ఉన్న ప్రశ్నాపత్రానికి గతంలో.. ఒక్క ఉద్యోగపరీక్షలోనూ విజయం సాధించని వారు… మొదటి ర్యాంకుల్లో ఉండటం… కనిపించే సాక్ష్యంగా మారింది. దీంతో.. పరీక్షలు రాసిన ఇరవై లక్షల మంది అభ్యర్థుల్లో ఆందోళన ప్రారంభమయింది. తాము మోసపోయామన్న భావనకు వారు వస్తున్నారు. దీనిపై స్పందించాల్సిన ప్రభుత్వం సైలెంట్ ఉండిపోయింది. కనీసం విచారణకు కూడా సిద్ధపడకుండా.. అదంతా ఉత్త ప్రచారమేనని తేల్చి… నియామకాలకు రంగం సిద్ధం చేసేస్తోంది.
నిజానికి శాశ్వత ఉద్యోగ నియామకాల ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. ఏపీపీఎస్సీ ఈ ఉద్యో నియామకాలను చేపడుతుంది. కానీ.. ఈ సారి మాత్రం… ఆయా డిపార్టుమెంట్లు విడివిడిగా నోటిఫికేషన్లు ఇచ్చాయి. పరీక్ష నిర్వహణకు మాత్రం ఏపీపీఎస్సీ సాయం చేసింది. దీని వల్ల ఏపీపీఎస్సీనే ఉద్యోగాలు నిర్వహించిందన్నట్లుగా ప్రచారం జరిగిపోయింది. నిజానికి ఏపీపీఎస్సీకీ.. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధం లేదు. ప్రింటింగ్, టైపింగ్, ప్రాసెసింగ్ లాంటి పనులు మాత్రమే చేసింది. దీంతో.. ఇప్పుడు.. పరీక్షల నిర్వహణ లోటు పాట్లకు ఎవరు సమాధానం చెబుతారన్నది… స్పష్టత లేకుండా పోయింది. ర్యాంకర్లు.. వారి బ్యాక్ గ్రౌండ్ చూస్తే.. పేపర్ కచ్చితంగా లీక్ అయిందని.. స్పష్టమవుతుంది. కానీ ఆంధ్రజ్యోతి బయట పెట్టింది కాబట్టి.. అంగీకరించడానికి .. ఏపీ సర్కార్ పెద్దలు సిద్ధంగా లేరన్న అభిప్రాయం… ఏర్పడుతోంది.
పరీక్ష రాసిన పలువురు… అది.. సచివాలయాల అభ్యర్థుల స్థాయిలో లేదని… గ్రూప్ వన్ స్థాయిలో ఉందని చెప్పుకొచ్చారు. ఆ ప్రకారం.. మార్కుల అంచనా.. 80, 90 మధ్యే ఉంటుందని అనుకున్నారు. కానీ.. టాపర్లు.. 115 వరకూ సాధించారు. అంత టాలెంట్ ఉంటే.. ఇతర పోటీ పరీక్షలు సులువుగానే గట్టెక్కేవారని నిపుణులు సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది.. సమస్యను దాచి పెట్టి… ఉద్యోగాలను నియమించడం కాదు. కోచింగులు తీసుకుని.. వేల రూపాయలు ఖర్చు పెట్టి.. ఎంతో శ్రమ చేసిన.. ఉద్యోగార్థులకు న్యాయం చేయడం. తప్పు జరిగితే.. దిద్డడం. లేపోతే.. అక్రమార్కులకు అలా… ఉద్యోగాలిచ్చేసినట్లే అవుతుంది.