వైసీపీకి ఉన్న పదకొండు మంది రాజ్యసభ్యుల్లో కనీసం ఆరేడుగురు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికి ఇప్పుడు ముహుర్తం ఖరారయిందని చెబుతున్నారు. జగన్ విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు. కుమార్తె పుట్టిన రోజుకని ఆయన కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. ఏకంగా ఇరవై ఐదు రోజుల పాటు ఆయన లండన్ లో గడపనున్నారు.
ఆయన విదేశీ పర్యటనకు వెళ్లిన తర్వాత ఇక్కడ రాజ్యసభ సభ్యులు కండువాలు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఆరేడుగురు సభ్యులు రాజీనామా చేస్తారని అంటున్నారు. మోపిదేవి ఇప్పటికే చంద్రబాబుతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. మరికొంత మంది కూడా చర్చలు పూర్తయ్యాయని అంటున్నారు. వారు టీడీపీలో చేరిన తర్వాత రాజీనామా లు చేస్తారని.. ఉపఎన్నికలు వస్తే.. వారికి కాకుండా ఇతరులకు చాన్స్ ఇస్తారు. రాజ్యసభ సభ్యునిగా ఉండటం ఇష్టం లేని కొంత మంది అదే పని చేయబోతున్నారు.
మరికొంత మందికి రాజ్యసభ సీట్లే ఖరారు చేయనున్నారని అంటున్నారు. అందరూ టీడీపీలోనే కాకుండా… బీజేపీలోనూ చేరే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మొత్తంగా జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన తర్వాత.. వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి.