నాయకుడు అంటే నడిపించేవాడు కానీ నెత్తి మీద కూర్చునేవాడు కాదని చాలా మంది చెబుతూంటారు . కానీ వైసీపీలో మాత్రం అది రివర్స్ . కరెంట్ చార్జీల పెంపునకు నిరసనగా అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు చేయాలని పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చిన జగన్ తాను మాత్రం పులివెందులలో శుభకార్యాలకు వెళ్లారు. ఫలితంగా అన్ని చోట్ల ఈ ధర్నాలు జరిగినా పులివెందులలో మాత్రం కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే అసలు జగన్ పట్టించుకోలేదు.
కానీ వైసీపీకి చెందిన యాక్టివ్ ఇంచార్జులు ఉన్న చోట్ల మాత్రం ఓ వంద , రెండు వందల మందితో ర్యాలీలు నిర్వహించే ప్రయత్నం చేశారు. కొంత వరకూ తాము డీలా పడిపోలేదని ర్యాలీలు చేయగలమని నిరూపించే ప్రయత్నం చేశారు. కానీ జగన్ పెళ్లిళ్లకు తిరగడంతో వారి పోరాటంలో సీరియస్ నెస్ లేకుండా పోయింది. వైసీపీ సోషల్ మీడియా తమ పార్టీ నేతలంతా ఎలా పోరాడుతున్నారో చూడండి అని.. ట్విట్టర్ మొత్తం నింపేసింది.కానీ మధ్యలో జగన్ , భారతి పులివెందులలో అహ్మద్,సంగీత పెళ్లికి వెళ్లారని ఓ వీడియో పెట్టడంతో అంతా తుస్ అనిపించింది.
మరో వైపు విద్యుత్ చార్జీల పెంపుపై వైసీపీ నేతలు చేసిన ఆరోపణల్ని టీడీపీ తీవ్రంగా ఖండించింది. అసలు విద్యుత్ చార్జీలు ఎవరు పెంచారో తేల్చుకుందాం రమ్మని వైసీపీ నేతలకు సవాల్ చేశారు. జగన్ హయాంలోనే ఈ పెంపుదల కోసం ఈఆర్సీ అనుమతి తీసుకున్నారని అదే జగన్ గెలిచి ఉంటే..ఇంతకు రెడింతలు బాది ఉండేవారని టీడీపీ నేతేలు చెబుతున్నారు. తమ హయాంలో ఒక్క రూపాయి కూడా కరెంట్ చార్జీలు పెంచేది లేదన్న విధానానికి కట్టుబడి ఉంటామని టీడీపీ నేతలు చెబుతున్నారు.